సలార్ పార్ట్ 1 మూవీ డిసెంబర్ 22 విడుదల

Published On: September 30, 2023   |   Posted By:

సలార్ పార్ట్ 1 మూవీ డిసెంబర్ 22 విడుదల

డిసెంబర్ 22న రాబోతోన్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా రిలీజ్ డేట్‌ను హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. భారీ మాస్ యాక్షన్‌తో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. సలార్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. సలార్ ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆడియెన్స్ ఎదురుచూడసాగారు.

హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. యువ, కాంతారా 2, రఘు తాత, రిచర్డ్ ఆంటోని, కేజీయఫ్ 3, సలార్ పార్ట్ 2, టైసన్ వంటి సినిమాలతో మున్ముందు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోంది.

క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియ్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈ పోస్టర్‌లో బీభత్సం సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఒళ్లంతా రక్తం నిండిపోయింది. ప్రతినాయకులను వేటాడి వెంటాడినట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ చేతిలో కత్తి, ఒంటికి అంటిన రక్తం చూస్తేనే ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది.

ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది.