సాయితేజ్ విరాళం
 
క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు రూ.10ల‌క్ష‌ల విరాళం ప్రకటించిన సుప్రీమ్ హీరో సాయితేజ్ 
 
క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రభుత్వాలకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. తాజాగా సుప్రీమ్ హీరో సాయితేజ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌లు విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. 
 
‘‘మనం  ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్ష‌ల విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి’’అని తెలిపారు సాయితేజ్‌