సింహధ్వని చిత్రం సెన్సార్ పూర్తి

Published On: March 14, 2024   |   Posted By:

సింహధ్వని చిత్రం సెన్సార్ పూర్తి

సింహధ్వని “సెన్సార్ పూర్తి
శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై  హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య  పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్  “సింహద్వని.” సెన్సార్  కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,”ఇదొక  డిఫరెంట్ యాక్షన్  మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. మరియు నిడదవోలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఇలా ఎన్నెన్నో పాత్రలు వస్తూ ఉంటాయి ఈ చిత్రం యొక్క సారాంశం ఏమిటంటే పెడదారి పడుతున్న యువత గంజాయి మత్తుమందు కు అలవాటు పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి, దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా ఎన్నెన్నో సంఘవిద్రోహులుగా అవుతున్నారు వీటన్నిటికీ కారుకులెవరు అన్నదే మా సినిమా సింహద్వని. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో  ప్రేక్షకుల ముందుకు  తీసుకు రానున్నము, అని అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ :భలగం, సోమలింగాచారి ,ఎడిటింగ్: దాసరి రవికుమార్ ,సంగీతం: రవికుమార్ మంద, కో ప్రొడ్యూసర్ :జి మహేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెరుకూరి శ్రీనివాస నాయుడు, నిర్మాత :ఎస్ సోమశేఖర్ ,కథ స్కిన్ ప్లే ,డైరెక్షన్: ఎస్ ఎస్ స్వామి
 పిఆర్ ఓ: బాశిoశెట్టి వీరబాబు