సినీ కార్మికుల కోసం వరుణ్ తేజ్ విరాళ‌o

సినీ కార్మికుల కోసం రూ.20 లక్ష‌లు విరాళ‌మిచ్చిన వరుణ్ తేజ్

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ కార్మికులను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. 

ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధి కి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.