సిరంగి చిత్రం ప్రారంభం

సాయి సౌజన్య క్రియేషన్స్ పతాకం పై శ్రీకాంత్ మరియు సందీప్తి హీరో హీరోయిన్ గా అప్పాజీ కొండా దర్శకత్వం లో ప్రతి మాధ్య చార్య నిర్మిస్తున్న చిత్రం సిరంగి. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత  పత్రి మధ్వా చార్య   క్లాప్ ఇచ్చారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో

చిత్ర నిర్మాత  ప్రతి మాధ్య చార్య మాట్లాడుతూ “సిరంగి కథ నాకు చాలా బాగా నచ్చింది, మా డైరెక్టర్ గారు అప్పాజీ కొండా సినిమా ని బాగా చిత్రీకరిస్తారు అని నమ్మకం ఉంది. యూనిట్ సభ్యులంతా బాగా కష్టపడుతున్నారు.  చాలా మంచి కథ తో వస్తున్నాం, ప్రేక్షకులకి బాగా నచుతుంది” అని తెలిపారు.

దర్శకుడు అప్పాజీ కొండా మాట్లాడుతూ “నాకు మంచి నిర్మాత దొరికాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు.  అద్భుతమైన కథ తో వస్తున్నాం. కొత్త వాళ్ళతో మంచి ప్రయోగం చేస్తున్నాం, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుంది. ఈ చిత్రాన్ని సూపర్ ప్రొడక్షన్ ద్వారా త్వరలో విడుదల చేస్తాం. రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వచ్చే నెల సెప్టెంబర్ 25 కి షూటింగ్ పూర్తీ చేస్తాం. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఒక 5 రోజులు మెదక్ ఫారెస్ట్ లొకేషన్ లో షూటింగ్ చేస్తాం” అని తెలిపారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ “ఇది ఒక హారర్ కామెడీ చిత్రం. కథ బాగుంది. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాత కి ధన్యవాదాలు”.

హీరోయిన్ సందీప్తి మాట్లాడుతూ “కరోనా టైం లోకూడా షూటింగ్ ప్రారంభించిన నిర్మాత గారికి ధన్యవాదాలు. నేను టైటిల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నాను. మంచి కథ దొరికినందుకు నేను చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను”.

 టైటిల్ :  సిరంగి

బ్యానర్ : సాయి సౌజన్య క్రియేషన్స్

నటీనటులు: శ్రీకాంత్, విజయ్,రాజకృష్ణ,సందీప్తి,ఫాజియ, సోనీ,ఆనతి,అస్మిత

కెమెరా మాన్ : ఎస్. వి. శివా రెడ్డి
మ్యూజిక్ : జయ సూర్య
ఎడిటర్ : రంగా
కో డైరెక్టర్ : ఈ . శంకర్ గౌడ్
డాన్స్ మాస్టర్ : అనీష్, రామ రావు
మేనేజర్ : శ్రీకాంత్ రెడ్డి
ప్రొడ్యూసర్ : పత్రి మధ్వా చార్య
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : అప్పాజీ కొండా