సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీ

శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై jr ntr బావమరిది నార్నె నితిన్ , సంపద హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U A సర్టిఫికెట్ పొందటం తో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ jr ntr బావమరిది నార్నె నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అలాగే మా దర్శకులు సతీష్ వేగేశ్న మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో U A సర్టిఫికెట్ పొందడం సంతోషం గా వుంది.. అన్ని హంగులతో మా చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నాం.అన్నారు.

నటీనటులు :

నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి

సాంకేతిక వర్గం :

సంగీతం: కైలాష్ మీనన్
కెమెరా: దాము నర్రావుల
ఎడిటర్: మధు
నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సతీష్ వేగేశ్న