సైకో చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి

సమాజానికి కొత్త మెసేజ్ ఇచ్చే ‘సైకో’

శ్రీమతి లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బానర్ పై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సైకో’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ సాయి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మిస్ కాకుండా రిచ్ గా సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే ఓ కొత్త పాయింట్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుందని, ఈ చిత్రం సమాజానికి ఓ కొత్త మెసేజ్ ఇస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలమని చిత్ర దర్శకుడు కార్తీక్ సాయి అంటున్నారు.
 
ఈ ‘సైకో’ చిత్రంలో హీరోగా కార్తీక్ సాయి, ఫిమేల్ లీడ్ రోల్స్ లో డాలి షా, నేహా దేశ్ పాండే నటిస్తుండగా..సీవిఎల్ నరసింహ, సంధ్య      తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ గా ఆర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ గా సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  తోట సతీష్, 
లైన్ ప్రొడ్యూసర్ గా ప్రియా, సంతోష్ కుమార్ పని చేస్తున్నారు.