స్కంద మూవీ షూటింగ్ పూర్తి

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ స్కంద షూటింగ్ పూర్తి

మాస్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద కోసం చేతులు కలిపారు. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్‌ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ మెటిరియల్ లో రామ్ మాస్ అవతార్ లో కనిపించారు.

ఇదీలావుండగా, మాసీవ్ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఫోటోలో రామ్, శ్రీలీల.. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు.

మేకర్స్‌కి ఇప్పుడు సినిమా ప్రమోషన్‌ కు తగిన సమయం దొరికింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా దీన్ని జోరుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు.

టీజర్, టైటిల్ గ్లింప్స్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించగా, ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాట అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఈ పాటలో రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ ఎలిగెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, సినిమా చూడాలనే క్యూరియాసిటీని మరింత పెంచడానికి రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద విడుదల కానుంది.

తారాగణం :

రామ్ పోతినేని, శ్రీలీల

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు