స్పార్క్L.I.F.E మూవీ నవంబర్ 17 విడుదల

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ భారీ బ‌డ్జెట్ సైక‌లాజిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ స్పార్క్L.I.F.E. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ

యంగ్ హీరో విక్రాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ ప్రెస్టీజియ‌స్ మూవీ స్పార్క్L.I.F.E. మెహ‌రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు హృదయం ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టించారు.

రీసెంట్‌గా స్పార్క్L.I.F.E షూటింగ్ పూర్త‌య్యింది. ఇప్పుడు మేక‌ర్స్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంలో బిజీగా ఉంది. ఎమోష‌న్స్‌, ల‌వ్‌, భారీ యాక్ష‌న్స్ సీక్వెన్సుల‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో సినిమాటోగ్రాఫ‌ర్ ఎ.ఆర్‌.అశోక్ కుమార్ సినిమాటోగ్ర‌పీ, హేషం అబ్దుల్ వ‌హాబ్ సంగీతం, నేప‌థ్య సంగీతం హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి.

ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీని వ‌రల్డ్ వైడ్‌గా న‌వంబ‌ర్ 17న రిలీజ్ చేయ‌నున్నారు. హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఆడియెన్స్ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది.

నటీనటులు :

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్, నాజ‌ర్‌, సుహాసిని, మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌

సాంకేతికవర్గం :

బ్యానర్: డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ:-17.11.2023
దర్శకుడు: విక్రాంత్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: ఏఆర్ అశోక్ కుమార్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: లీలా రెడ్డి