హీరో రక్షిత్ కొత్త సినిమా

కరోనా నేపథ్యంలో “పలాస” హీరో రక్షిత్ కొత్త సినిమా

“పలాస 1978” తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కు “W H O” (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్  థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ కి మంచి స్పందన లభిస్తుంది.

“I’m gonna tell god everything” వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథ తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.