అంతరాత్మ మూవీ ప్రారంభం

Published On: October 26, 2023   |   Posted By:

అంతరాత్మ మూవీ ప్రారంభం

నేడు పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైన అంతరాత్మ

లాండ్ మార్క్ మూవీస్, హైదరాబాద్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అంతరాత్మ. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టిస్ట్ ఆలీ , MLA కాటసాని రామభూపాల్ రెడ్డి , ACP బాలకృష్ణ రెడ్డి , IAS Officer మురళీమోహన్, వినయ్, ఏలూరు దుర్గా రెడ్డి, భవాని రెడ్డి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి క్లాప్ కొట్టగా. ACP బాలకృష్ణ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆలీ స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా M. నాగ రాజశేఖర్ మాట్లాడుతూ నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశాం.

నటీనటులు ;

ఎలీనా, లాస్య స్మైలీ, తన్వి, శశిరేఖ, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్ బాబు

సాంకేతికవర్గం :

కెమెరా: నాగరాజు
ఎడిటర్: పి. శేషు
సంగీతం: GM. సతీష్
నిర్మాతలు: తుమ్మల మనోజ్ యాదవ్, రావూరు సురేందర్ రెడ్డి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: M. నాగ రాజశేఖర్ రెడ్డి