ఊరు పేరు భైరవకోన మూవీ సెకండ్ సింగిల్ అక్టోబర్ 28 విడుదల

Published On: October 26, 2023   |   Posted By:

ఊరు పేరు భైరవకోన మూవీ సెకండ్ సింగిల్ అక్టోబర్ 28 విడుదల

సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ ఊరు పేరు భైరవకోన సెకండ్ సింగిల్ హమ్మా హమ్మా అక్టోబర్ 28న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచగా.. ఫస్ట్ సింగిల్‌ నిజమే చెబుతున్న చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. ఊరు పేరు భైరవకోనసెకండ్ సింగిల్ హమ్మా హమ్మా ఈ నెల 28న విడుదల కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ లవ్లీ అండ్ గ్రేస్ ఫుల్ గా కనిపించారు.

కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

తారాగణం :

సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు

సాంకేతిక విభాగం:

కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ : రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్