అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్

Published On: October 10, 2023   |   Posted By:

అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా టీజర్ రిలీజ్

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్నఅంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్, భరత్ కమ్మ నిర్మాత ఎస్కేఎన్, ఛాయ్ బిస్కట్ శరత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ చూడగానే ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయా. ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాం. మూవీ చేస్తున్న క్రమంలో యూనిట్ అంతా ఒక ఫ్యామిలీలాగ అయిపోయాం. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చి, నేను చేయగలను అని బిలీవ్ చేసిన దర్శకుడు దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టెక్నికల్ గా అన్ని క్రాఫ్ట్ లలో సినిమా ఆకట్టుకుంటుంది. మూవీ మీ అందరికీ నచ్చేలా బాగుంటుంది. అన్నారు.

యాక్టర్ జగదీశ్ మాట్లాడుతూ – సుహాస్ అన్న యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన మజిలీ సినిమా చూసినప్పుడు నటుడిగా ఒక ఇన్సిపిరేషన్ కలిగింది. మనకూ అవకాశాలు వస్తాయని నమ్మాను. అంబాజీపేట మ్యారేజి బ్యాండు లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అన్నారు.

యాక్టర్ నితిన్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశాం. నా కెరీర్ లో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కు దుశ్యంత్ కు థ్యాంక్స్. మల్లీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. మీకు ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కనిపించరు. కేవలం ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అంతలా ప్రతి ఒక్కరూ కథలో కలిసిపోయినట్లు నటించారు. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు కథను నమ్మి టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా కష్టపడ్డాం. ఈ కథను ఇంతే సహజంగా తెరపైకి తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచన మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరిలో ఉండేది. మంచి సినిమా చేశామని నమ్ముతున్నాం. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ థియేటర్ లో తప్పకుండా చూడండి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ – రైటర్ పద్మభూషణ్ తర్వాత సుహాస్ తో నేను వర్క్ చేస్తున్న రెండో సినిమా ఇది. పాట బాగా వచ్చినా, ఆర్ఆర్ బాగున్నా స్టూడియోకు వచ్చి సెలబ్రేట్ చేస్తుంటాడు సుహాస్. ఈ సినిమాను డైరెక్టర్ చాలా సహజంగా చిత్రీకరించాడు. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి మంచి ట్యూన్స్ చేశాం. ఒక లవ్ సాంగ్. ఈ పాటలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నాను. థియేటర్ లో మా మూవీ చూడండి. అన్నారు.

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ కు వెళ్లాను. కానీ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యానని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఫస్ట్ మూవీ అవకాశం రావడం నమ్మలేకపోయాను. ఈ సినిమా హీరోయిన్ లక్ష్మీ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ దుశ్యంత్ కు థ్యాంక్స్. ఆయన చాలా మొండివాడు. సెట్ లో సీన్ కు కావాల్సినవన్నీ ఉండాల్సిందే. అదే పట్టుదల, కన్విక్షన్ తో సినిమా చేశాడు. టీజర్ లో మీకు ఆ క్వాలిటీ కనిపిస్తుంది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు లో ప్రతి ఒక్కరికీ యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మల్లీ మేము చేయగలమో లేదో తెలియదు. సుహాస్ మంచి కోస్టార్. అతని ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. ఇందులో కూడా చాలా న్యాచురల్ గా నటించాడు. అతను మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా నేను చూశాను. ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సుహాస్ కెరీర్ లో ఇప్పటిదాకా వైవిధ్యమైన సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా వాటిన్నంటిలో గొప్పగా నిలబడిపోతుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో సుహాస్ యాక్టింగ్ జెమ్ అనుకోవాలి. మరో రెండేళ్లలో సుహాస్ హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. నేను నా పిల్లలకు సుహాస్ మామ ఏం చేశాడంటే ఈ సినిమా చూపిస్తా. లక్ష్మీ క్యారెక్టర్ లో శివాని సూపర్బ్ గా నటించింది. దుశ్యంత్ నా ఫ్రెండ్. మా బ్యాచ్ నుంచి వస్తున్న మరో డైరెక్టర్. ఈ సినిమాతో అతను డైరెక్టర్ గా నిలబడిపోతాడు. అలాగే టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఈ సినిమా పోస్టర్, టైటిల్ చూసినప్పుడే వీళ్లు ఎంత నేటివ్ గా కథను తెరకెక్కిస్తున్నారో అర్థమైంది. అలాగే టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా చూపించమని అడిగితే వాళ్లు చూపించారు. చాలా మెచ్యూర్డ్ రైటింగ్ తో దుశ్యంత్ సినిమాను తెరకెక్కించాడు. చాలా నాచురల్ గా ఉంటూనే ప్రతి సీన్ లో ఒక డ్రామా ఉంటుంది. సుహాస్ యాక్టర్ గా కలర్ ఫొటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ చేశాడు. ఆ తర్వాత అతని సినిమాలన్నీ కంటెంట్ ఉన్నవి ఎంచుకుంటున్నాడు. ఈ మూవీ కూడా పెద్ద హిట్ కావాలి. అన్నారు.

డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ – సినిమా కావాల్సిన హైప్ క్రియేట్ చేయడం టీజర్ పని. అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ చూశాక నాకు మూవీ మీద ఆ క్యూరియాసిటీ ఏర్పడింది. ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ బాగుంది. ఆర్టిస్టులందరి ఫర్ ఫార్మెన్స్ బాగుందంటే డైరెక్టర్ బాగా చేయించాడని, అందుకు దుశ్యంత్ ను అప్రిషియేట్ చేస్తున్నా. సినిమా ఆల్రెడీ హిట్ అని మన వాళ్లు చెబుతున్నారు. సో..ఈ టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – సుహాస్ మా హిట్ 2 సినిమా చేసేప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు గురించి తరుచూ చెప్పేవాడు. ఈ సినిమాలో గుండు సీన్ ఉంది. హిట్ 2 కంప్లీట్ కాకముందే ఆ సీన్ కోసం ఎక్కడ గుండు చేయించుకుంటాడో అని భయపడేవాడిని. ప్రతి ఒక్క ఆడియెన్ ఓన్ చేసుకునే నటులు కొందరే ఉంటారు. సుహాస్ అలాంటి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా చూశాను. ఇందులో ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. క్రిటిక్స్ దగ్గర నుంచి ఆడియెన్స్ దాకా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తారు. డైరెక్టర్ దుశ్యంత్ ఈ సినిమాతో హిట్ కొట్టినట్లే. ఆర్ఆర్ బాగా చేసే బాధ్యత శేఖర్ చంద్రదే. ఇక ఆయన చేతుల్లో ఉంది. మా ధీరజ్ మంచి ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్. ఆయనతో పాటు టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – ఈ సినిమా కంటెంట్ చూశాను. మంచి మూవీ చేశారు. కొత్త దర్శకుడు చేసినట్లు లేదు. దుశ్యంత్ ఒక పది సినిమాల తర్వాత ఈ మూవీ చేసినట్లు రూపొందించాడు. సుహాస్ మంచి యాక్టర్. తన కెరీర్ బిగినింగ్ లో ఎవరెవరు తనతో సినిమాలు చేశారోవాళ్లందరితో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మా ధీరజ్ కు మరో హిట్ ఇవ్వాలి. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ – అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. ధీరజ్ గారు మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ క్యారెక్టర్ లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ ఔట్ పుట్ సూపర్బ్ గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్ ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్ లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్ లో అలాంటి అచ్చు లాంటి సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ – ఇక్కడికి మా సినిమా టీజర్ రిలీజ్ కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. నాలాంటి ఒక కొత్త డైరెక్టర్ కు జీఏ2 పిక్చర్స్ లో మూవీ అవకాశం రావడం చాలా గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అంబాజీపేట మ్యారేజి బ్యాండు లాంటి మూవీకి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. నాకు మా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ధీరజ్, వెంకటేష్ మహా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మంచి సినిమా చేద్దామని ఎంకరేజ్ చేశారు. సుహాస్ నాకు మంచి ఫ్రెండ్. 2017లో మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రెండు సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ టైమ్ లో మేము కొన్ని కథలు అనుకున్నాం. ఖచ్చితంగా కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. నేను ఈ కథను ఫోన్ లో లైన్ గా చెప్పాను. టైటిల్, స్టోరీ లైన్ విని మనం సినిమా చేద్దాం అన్నారు సుహాస్. నాతో మూవీ చేసినందుకు సుహాస్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.