అభిమాని చిత్రంలో యముడిగా అజయ్ ఘోష్

Published On: February 22, 2024   |   Posted By:

అభిమాని చిత్రంలో యముడిగా అజయ్ ఘోష్

“అభిమాని” లో యముడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం: అజయ్ ఘోష్ 
సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో “అభిమాని “అనే వెబ్ ఫిలిం చేస్తున్నారు.
2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాను సోషల్ మీడియాలో  సురేష్ కొండేటి అనౌన్స్ చేశారు .
ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్.
ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది.
ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్ తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ “యముడు పాత్ర అనగానే తెలుగు వారికి  కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు. అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్. సురేష్ కొండేటి గారిని ప్రెస్ మీట్స్ లో చూసి ఇప్పుడు ఆయన హీరోగా నేను యముడిగా చేయడం చాలా బాగుంది. ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది అన్నారు.
దర్శకుడు రాంబాబు దోమకొండ మాట్లాడుతూ సినిమా షూటింగ్  పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి, త్వరలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అన్నారు .  అనుకున్నదానికంటే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సురేష్ కొండేటి గారు, అజయ్ ఘోష్ గారు అద్బుతం గా  నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే మరొక ముఖ్య పాత్ర లో అన్నపూర్ణమ్మ గారి సహకారం మరువలేనిది అన్నారు.
ఇంకా ఈ సినిమా లో జై క్రిష్, అక్సాఖాన్, దర్శన్, రెహ్మాన్ ఇతర సీనియర్ నటీనటులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ : శ్రీధన్, ఫోటోగ్రఫీ : శేషు డి  నాయుడు,మాటలు : చరణ్, ఎడిటింగ్ : ఇంద్ర కర్నాటి అందించారు.