ఆదిపర్వం మూవీ పాటలు విడుదల

Published On: April 12, 2024   |   Posted By:

ఆదిపర్వం మూవీ పాటలు విడుదల

ఆదిపర్వం పాటలు అదిరిపోయాయి  ప్రముఖ సంగీత దర్శకుల మెచ్చుకోలు

ఆదిపర్వం ఇది అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు.

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్  ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు  కన్నడ  హిందీ  తమిళ  మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి… ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలన సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి క్రిష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపా నాయకులు మరియు నిర్మాత చీర్ల శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు యనమల భాస్కరరావు, డాన్స్ మాస్టర్ సన్ రేస్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ వి.ఉదయ శంకర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సినిమా మ్యూజిక్ లో భాగం అయిన భారతి బాబు (రచయిత), రామ్ సుధి (మ్యూజిక్ డైరెక్టర్), బి. సుల్తాన్ వలి (మ్యూజిక్ డైరెక్టర్), ఓపెన్ బనాన ప్రవీణ్ (మ్యూజిక్ డైరెక్టర్), లూబిక్ లీ మార్విన్ (మ్యూజిక్ డైరెక్టర్),ఊటుకూరు రంగారావు (గీత రచయిత), రాజ్ కుమార్ సిరా (రచయిత), సాగర్ నారాయణ(రచయిత), సత్యమూర్తి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), లక్ష్మి పద్మజ (సింగర్), మేఘన నాయుడు, వినాయక్ (సింగర్), వెంకి (సింగర్), అపర్ణ (సింగర్), నటీనటులు : సమ్మెట గాంధీ, జెమిని సురేష్, అయేష, శివ కంఠమనేని, రావుల వెంకటేశ్వర్ రావు, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్.శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ ఆదిపర్వం గీతాలను ఆవిష్కరించారు.

ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలు అభినందనీయులని వారు పేర్కొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని మిగతా అతిధులు అభిలషించారు. చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాంఅన్నారు.

మంచులక్ష్మీ, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, శివకంఠంనేని , వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెటగాంధీ, యోగికత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, జ్యోతి, శ్రీరామ్, రాఘవేంద్ర, అమృత్,రాజ్ కుమార్, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), పద్మారావు, సునీల్, మల్లి, నాగరాజు, మృత్యుంజయ శర్మ తదితరులతోపాటు దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

నటీనటులు :

మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.

సాంకేతికవర్గం:

సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
మ్యూజిక్ : మాధవ్ సైబా  సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి,
నిర్మాత : ఎమ్.ఎస్.కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ కుమార్ మేగోటి