రామ జన్మభూమి  మూవీ టీసర్ లాంచ్

రామ జన్మభూమి టీసర్ లాంచ్
సముద్ర మూవీస్ బ్యానర్ నుండి ‘రామ జన్మభూమి’ టీసర్ రిలీజ్ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు.
సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ఈరోజు దేశం మొత్తం ఎక్కడ విన్నా జై శ్రీ రామ్ నినాదమే. రామ జన్మ భూమి నిర్మాణం అయ్యాక రోజు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, అలాంటి ‘రామ జన్మ భూమి’ టైటిల్ తో దర్శకుడు సముద్ర గారు జై సిద్దార్ద్ హీరోగా సినిమా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సముద్రగారు ఎన్నో హిట్టు సినిమాలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళి ఫార్మ్ లోకి వచ్చారు, కచ్చితంగా ఈ ‘రామ జన్మభూమి’ కూడా పెద్ద హిట్ అవుతుంది.
బి జే పి ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ:  ఈరోజు కర్నల్ బిక్షపతి గారు ఫోన్ చేసారు, ఒకప్పుడు కాశ్మీర్లో మిలిటరీ వారి ముఖాల మీద, మోకాళ్ళ మీద రాళ్ళూ వేసే వారు, అందుకని పేస్ షీల్డ్స్ అండ్ క్నీ పాడ్స్ ఇచ్చాము, మోది గారు ఆర్టికల్ 370 ఎత్తేయ్యగానే ఆ రాళ్ళూ విసిరే వాళ్ళే లేరు అని చెప్పారు. ఈ మార్పు అంతా కూడా మోది గారు వల్లనే వచ్చింది. ఎంత మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనం రాముడినే ఎక్కువగా కొలవడానికి కారణం రాముడు ఈ భూమి మీద ధర్మ బద్ధంగా ఉంటూ అనేక కష్టాలు అనుభవించారు. ‘రామ జన్మభూమి’ టీసర్ కొస్తే  హీరో తన దేశ భక్తి చాటుకునేలా ఉంది, సినిమా మంచి హిట్టు అవ్వాలని కోరుకుంటూన్నాను
డైరెక్టర్ సముద్ర రావు మాట్లాడుతూ: ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, దేవుడే రాముడిగా వచ్చినా మానవుడిగా ధర్మ బద్దంగా బ్రతికారు, ఒక దేశానికి రాజుగా, ఒక తండ్రికి మంచి బిడ్డగా, తమ్ముళ్ళకి అన్నగా ఇలా ధర్మ బద్ధంగా బ్రతికి మనకి చూపించారు. ప్రతి పౌరుడు రాముడిలా బ్రతకాలి, ధర్మంగా మెలగాలని  మనస్పూర్తిగా కోరుకుంటూ, రాజకీయాలలోకి యువత కచ్చితంగా రావాలి అనే సందేశంతో ఈ సినిమా చేస్తున్నాను.
హీరో జై సిద్ధార్థ్ మాట్లాడుతూ:  ఇండస్ట్రీకీ సింహరాశి, శివ రామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరీ, మహానంది  లాంటి గొప్ప సినిమాలని అందించిన వి. సముద్ర గారి దర్శకత్వంలో నా రాముడి పేరుతో వచ్చిన ‘రామ జన్మ భూమి’ సినీమాతో నేను హీరో గా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. రాముడు ఎప్పుడో మనకి నేర్పిన వాటిని మనం ఎప్పుడూ తప్పకుండా పాటించాలి, అలా పాటించడం మర్చిపోయినప్పుడు, హనుమంతుడు వచ్చి సరి చేసి వెళ్తారు, అందుకే ఇప్పుడు నరేంద్రమోది గారు హనుమంతుని రూపంలో వచ్చి మన దేశాన్ని గాడిలో పెడుతున్నారు. అలాగే లోకల్ లో చాలా మంది చిన్న చిన్న రాక్షసులు ఉంటారు వాళ్ళని లైన్  లో పెట్టడానికి యువత రాజకీయాలలోకి రావాలి అనేది మా కథ.
మా ‘రామ జన్మ భూమి’ అప్డేట్స్, రిలీజ్ డేట్ ముందు ముందు మరెన్నో ఇచ్చి ప్రేక్షకులని ఇదే రీతిలో అలరిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు
నటీనటులు: జై సిద్ధార్ద్, శ్రీ రాధా ,నాసర్, సుమన్, అజయ్ గోష్,సునీల్, అనుపమ్ ఖేర్, కన్నడ కిషోర్, బాహుబలి ప్రభాకర్, దేవ్ గిల్,బీసంట్ రవి, తమిళ్ శ్రీ రామ్,దేవరాజ్ తదితరులు
టెక్నికల్ విభాగం:
నిర్మాత: వి. సముద్ర రావ్
దర్శకుడు: వి. సముద్ర రావ్
సహా నిర్మాతలు: ఖాజా. దుర్గయ్య, కోటేశ్వర రావు. శ్రీ హరి
మ్యూజిక్: రవి శంకర్
లిరిక్స్: వెనిగల్ల రాము, అభినయ శ్రీను
పిఆర్ఓ: మధు విఆర్