ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫస్ట్ స్ట్రైక్ విడుదల

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మోస్ట్ అవైటెడ్ ఆపరేషన్ వాలెంటైన్ నుండి ది ఫస్ట్ స్ట్రైక్ విడుదల

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొంది తెలుగు, హిందీ భాషలలో చిత్రీకరించబడిన ఈ ద్విభాషా చిత్రం హై ఆక్టేన్ యాక్షన్ ఏరియల్ అడ్వంచర్ ని ప్రామిస్ చేస్తోంది

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గత సంవత్సరం విడుదలైన విజయవంతమైన చిత్రం మేజర్ తర్వాత మరొక దేశభక్తి అడ్రినలిన్ పంపింగ్ థ్రిల్లర్ ఆపరేషన్ వాలెంటైన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రం మోషన్ టీజర్ గత వారం విడుదలై ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇచ్చింది. వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఈ రోజు ఈ చిత్రం ది ఫస్ట్ స్ట్రైక్ టీజర్‌ను విడుదల చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులకు గూస్‌బంప్‌ ని ఇచ్చింది.

ది ఫస్ట్ స్ట్రైక్ లో హీరో వరుణ్ తేజ్ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ దేశం గాంధీజీ తో పాటు సుభాష్ చంద్రబోస్ ది కుడా అని శత్రువులకు గుర్తు చేయడం మన దేశానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. వందేమాత్రం నేపథ్య సంగీతం ప్రేక్షకులలో దేశభక్తిని రేకెత్తిస్తోంది. ఇది అతిపెద్ద వైమానిక దాడిని చూసేందుకు ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా కథ మన వైమానిక దళ హీరోల ధైర్య సాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపధ్యంలో వుంటుంది.

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఆపరేషన్ వాలెంటైన్ దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్. ఇందులో అర్జున్ దేవ్‌గా వరుణ్ తేజ్, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటించారు. మానుషి తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు.

ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్) సహా నిర్మాతలు.

అనుభవజ్ఞుడైన యాడ్ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్ . ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న తెలుగు, హిందీలో విడుదల కానుంది.

సాంకేతిక వర్గం :

దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
నిర్మాతలు: సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ & సందీప్ ముద్దా
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: హరి కె వేదాంతం
ఎడిటర్: నవీన్ నూలి