ఇద్దరికీ కొత్తేగా మూవీ ప్రారంభం

Published On: February 16, 2024   |   Posted By:

ఇద్దరికీ కొత్తేగా మూవీ ప్రారంభం

సినీ ప్రముఖుల సమక్షంలో కె. హేమచంద్రారెడ్డి హీరోగా ఇద్దరికీ కొత్తేగా ప్రారంభం

కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై కుల్లపరెడ్డి సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇద్దరికీ కొత్తేగా. వసంత పంచమి, ప్రేమికుల రోజును పురస్కరించుకుని బుధవారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, సి. కల్యాణ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. హైకోర్టు న్యాయమూర్తి శ్వేత, ప్రసన్నకుమార్‌, తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ జడ్జి మాల్యాద్రి, మేక మేనక స్క్రిప్ట్‌ను దర్శకుడు సురేష్‌బాబుకు అందించారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ…
వకాలత్‌ సినిమాతో హీరోగా మారిన సురేష్‌బాబు ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా లాంచ్‌ చేస్తున్నారు. మా అందరి సపోర్ట్‌ ఆయనకు ఉంటుంది అన్నారు.

సి. కల్యాణ్‌ మాట్లాడుతూ…
తన జీవితన కథనే సినిమాగా మలిచి సురేష్‌బాబు తన దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ఇద్దరికీ కొత్తేగా చిత్రం ద్వారా ఆయన కుమారుడు హేమచంద్రారెడ్డిని పరిచయం చేస్తుండడం విశేషం. హేమచంద్రారెడ్డి భవిష్యత్తులో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ…
హీరో హేమ చంద్రారెడ్డికి హీరోకు కావాల్సిన అన్ని ఫీచర్స్‌ ఉన్నాయి. తండ్రి దర్శకత్వంలో హీరోగా వస్తున్నందున హేమచంద్రారెడ్డికి టెన్షన్‌ ఫ్రీగా ఉంటుంది అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…
ఒక కొత్త హీరో లాంచ్‌ మూవీకి ఇంతమంది అతిథులు రావడం చాలా అరుదు. సురేష్‌బాబుకు, ఆయన కుమారుడికి నా అభినందనలు అన్నారు.

హైకోర్టు న్యాయవాది శ్వేతారెడ్డి మాట్లాడుతూ…
మా అబ్బాయి హీరోగా నటిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమంది పెద్దల దీవెనలతో హీరో అవుతున్న మా అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు అన్నారు.

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ…
హేమచంద్రారెడ్డి హీరోగా నటిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. సురేష్‌బాబు తన కుమారుణ్ణి తప్పకుండా మంచి హీరోను చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

దర్శక నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ…
గతంలో నేను వకాలత్‌ నామా అనే సినిమాలో హీరోగా చేశాను. ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. మా అబ్బాయిని హీరోగా, నా లైఫ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నాను. ముగ్గురు హీరోయిన్‌లు, మంచి ప్యాడిరగ్‌ ఉంటుంది. కె.యస్‌. రామారావు గారు మాకు అండగా నిలిచారు. ప్రేక్షకులు ఆశించి అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి.

సాంకేతిక వర్గం :

కెమెరా: కోట తిరుపతిరెడ్డి
మాటలు: కరుణాకర్‌, కె.కె. రెడ్డి
సంగీతం: ఎం.ఎం.ఎస్‌, కథ
మాటలు, దర్శకత్వం : కుల్లపరెడ్డి సురేష్‌బాబు