ఒక ఏలియన్ ప్రేమ కథ చిత్రం  గీతావిష్కరణ 
 
మయా మూవీ మేకర్స్ సమర్పిస్తున్న చిత్రం ‘ఒక ఏలియన్ ప్రేమ కథ’. తిలక్, సుష్మా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి లెన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పి ఆర్ కె. ఫిలిమ్స్  ప్రసాద్ విడుదల చేయనున్నాడు. కన్నడలో జి కె. మధురి ఉమేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర గీతాలను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకకు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మల పల్లి రామసత్యనారాయణలు ముఖ్య అథితులుగా హాజరయ్యి ఈ చిత్ర గీతాలను విడుదల చేశారు. అనంతరం మొదట ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సాంగ్స్, ట్రైలర్ లు చాలా బాగున్నాయి.. జగదేక వీరుడు అతిలోక సుందరి లా అనిపిస్తోంది కాన్సెప్ట్. అందులో శ్రీదేవి భూలోకానికి వచ్చి మానవుడిని ప్రేమించినట్టు,  ఒక ఏలియన్ గ్రహాంతర వాసి ఒక ఆర్మీ ని ప్రేమించడమనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్  గా అనిపించింది. కొత్త వారిని ఎంకరేజ్  చేయడం లో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది.. అలానే ఇప్ప్డుడు ఈ చిత్రం తో పరిచయం అవుతున్న నిర్మాత ఉమేష్ గారిని కూడా సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. 
 
నిర్మాత  ఉమేష్ మాట్లాడుతూ… నేను కర్ణాటక వాసిని. అంతేకాదు నేను సదరన్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇంజనీర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నా..  తెలుగులో సినిమా చేయాలనే తపనతోనే ఇక్కడికే వచ్చాను. ఈ మా ‘ఒక ఏలియన్ ప్రేమ కథ’ చిత్రాన్ని తెలుగు మరియు కన్నడ భాషల్లో ఆగస్టు నెలలో విడుదల చేయననున్నాము..  ఈ చిత్రాన్ని లెన్లీ దర్శకత్వం వహించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. వేరే గ్రహం నుండి ప్రేమ అనే ఆయుధాన్ని వెతుక్కుంటూ ఒక ఏలియన్( హీరోయిన్) మన గ్రహానికి వస్తుంది. అయితే ప్రేమ అనేది ఆయుధం కాదు అది ఒక అనుభూతాని ఎలా  తెలియచేస్తాడు  హీరో అనేదే కాన్సెప్ట్.  చాలా అద్భుతంగా తెరకెక్కించాము. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.. అందరికీ నచ్చేలా ఉంటుందని తెలియ చేశారు.
 
ఈ కార్యక్రమంలో పి ఆర్ కె ఫిలిమ్స్ అధినేత మరియు డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 
 
తిలక్, సుష్మ, రమేష్ బట్, మని, విజయ లక్ష్మి, బెంగళూరు నగేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: లెన్లీ, డిఒపి: రుద్రమని, మ్యూజిక్: వికాస్ వసిష్ఠ, ఎడిటర్: శ్రీనివాస్ అండ్ టీమ్, ప్రొడ్యూసర్: జి కె. మధురి ఉమేష్.