కమిట్ మెంట్ చిత్రం గ్రాండ్ రిలీజ్
ఆగష్టు 19 న కమిట్ మెంట్ చిత్రం గ్రాండ్ రిలీజ్
టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రస్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం కమిట్ మెంట్ ఇందులో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి.వీరు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్ మరియు నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా పనిచేసిన ప్రతి ఒక్క నటి నటులు టెక్నిషియన్ సపోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
నటీనటులు:
తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి, సీమర్ సింగ్, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, అభయ్ రెడ్డి, తన్కిష్క్ జైన్, రాజా రవీంద్ర తదితరులు.
నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్
ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.చెన్న
మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్
డి.ఓ.పి : సాజీశ్ రాజేంద్రన్, నరేష్ రాణా,
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ద్వారకేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి
డైలాగ్స్ : సంతోష్ హర్ష, కార్తీక్, అర్జున్, కళ్లి కళ్యాణ్,
కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం
ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి
లిరిక్స్ : పూర్ణ చారి, గాంధీ
కొరియోగ్రఫీ : హరికిరణ్
కో డైరెక్టర్ : మెహర్
పీ.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి