కళాపోషకులు చిత్రం నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల

Published On: November 5, 2020   |   Posted By:
కళాపోషకులు చిత్రం నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల
 
 
మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా ‘కళాపోషకులు’ చిత్రం నుండి నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల
 
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.  న‌టుడు జెమిని సురేష్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలోని నువ్విలా… నువ్విలా అంటూ సాగే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు చలపతి పువ్వల మాట్లాడుతూ ..
కళాపోషకులు మూవీ నుండి చిత్ర, విజయ్ ప్రకాష్ గారు అద్భుతంగా పాడిన నువ్వేలే… నువ్వేలే.. పాటను సుస్వరాల కిరీటి కోటి గారు విడుదల చెయ్యడంతో ఆనందంగా ఉంది.  న‌న్ను నమ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించ‌డం వ‌ల్లే ఔట్‌పుట్ ఇంత‌బాగా వ‌చ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొద‌టి సినిమా అయినా చాలా బాగా న‌టించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించిందని అన్నారు.
 
నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…
టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ క‌థకి హీరోగా విశ్వకార్తికేయ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా  అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి అన్నారు.
 
హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ –  “ఈ మూవీ ఒక  టీమ్ వ‌ర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్  సపోర్ట్‌తోనే మంచి ఔట్‌పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకున్నారు. చ‌ల‌ప‌తి గారు ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. మేమంద‌రం ఎంతో ఇష్టంగా క‌ష్ట‌ప‌డి చేసిన `క‌ళాపోష‌కులు` చిత్రానికి  మీ అంద‌రి ఆశిర్వాదాలు ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
 
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను 
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.