మేరానామ్ జోక‌ర్ చిత్రం ప్రారంభం

Published On: November 5, 2020   |   Posted By:

మేరానామ్ జోక‌ర్ చిత్రం ప్రారంభం

సె‌న్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ మారుతి చేతుల మీదుగా  4am మూవీమేక‌ర్స్  మేరానామ్ జోక‌ర్ పూజాకార్య‌క్ర‌మం

1970 లొ విడుద‌ల‌య్యి స‌న్సేష‌న‌ల్ సూప‌ర్‌హిట్ అయ్యిన మేరా నామ్ జోక‌ర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. అలాంటి లెజెండ‌రి క్లాసిక్ టైటిల్ ని మ‌రొక్క‌సారి ద‌ర్శ‌కుడు సూర్య‌గోపాల్ ప‌రిచ‌యం చేస్తున్నారు. 4am మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సూర్య‌గొపాల్ ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మాత‌లు శివ ఎన్‌, ఎస్‌.జి.కృష్ణ, న‌వీన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విజ‌య ద‌శ‌మి సంద‌ర్బంగా స‌న్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ మారుతి పూజాకార్య‌క్ర‌మం లో పాల్గోన్నారు. మారుతి గారు ఈ సినిమా కి సంబందించి మెద‌టి షాట్ దేవుడు ప‌టాల‌పై క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అలాగే ద‌ర్శ‌కుడు గొపాల్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ లో సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. 
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. నా స్నేహితుడు సూర్య గొపాల్ కి సినిమా అంటే చాలా ఇష్టం. మేరా నామ్ జోక‌ర్ అనే టైటిలంటేనే సూప‌ర్‌హిట్‌. అలాంటిది చాలా సంవ‌త్స‌రాల త‌రువాత ఈ టైటిల్‌‌తో మ‌ళ్ళి సినిమా రావ‌టం చాలా ఆనందంగా వుంది. మా గొపాల్ కి మంచి హిట్ రావాల‌ని కొరుకుంటున్నాను.
ద‌ర్శ‌కుడు సూర్య గొపాల్ మాట్లాడుతూ.. మా సినిమా ప్రారంభానికి వ‌చ్చిన మీడియా సోద‌రులంద‌రికి థ్యాంక్స్‌, నేను మా మిత్రులు క‌లిసి 4am మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-1 ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి మా ద‌ర్శ‌కుడు మారుతి గారి చేతుల మీదుగా మేరా నామ్ జోక‌ర్ టైటిల్ ఎనౌన్స్ చేయ‌టం మా అదృష్ణం గా భావిస్తున్నాము.  ఈ చిత్రం లో పాన్ ఇండియా ఆర్టిస్ట్ లు చేయ‌నున్నారు. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాము‌. అని అన్నారు
ర‌చ‌యిత రాజు బొనాల మాట్లాడూతూ.. మా ద‌ర్శ‌కుడు గొపాల్ గారు ప్ర‌తి రోజు ఉద‌య‌మే 4 గంట‌ల‌కి లేచి ప‌నిచేసుకుంటారు. అందుకేనేమో బ్యాన‌ర్ నేమ్ 4am అని పెట్టారు. ఈ చిత్రం చాలా డిఫ‌రెంట్ గా వుంటుంది. చాలా కొత్త స‌బ్జక్ట్ దాదాపు 3 సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి చేశాము. 24 క్రాఫ్ట్ పై క‌మాండ్ వున్న ద‌ర్శ‌కుడు గొపాల్ గారు, నాకు మంచి అవ‌కాశం ఇచ్చినందుకు చాలా ఆనందం గా వుంది. అని అన్నారు
బ్యాన‌ర్‌.. 4am మూవీమేక‌ర్స్క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం … సూర్య గొపాల్‌నిర్మాత‌లు… శివ‌.ఎన్‌, ఎస్‌.జి.కృష్ణ‌, న‌వీన్‌