కళ్యాణం కమనీయం సినిమా ఫస్ట్ లుక్ విడుదల

 

యువ హీరో సంతోష్ శోభన్, యూవీ కాన్సెప్ట్స్ కళ్యాణం కమనీయం టైటిల్ మోషన్
పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల, జనవరి 14న సినిమా విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా కళ్యాణం కమనీయం . ఈ
చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో
ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్
కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా టైటిల్
మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ప్లెజంట్ విజువల్స్
కు అంతే అందమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. కంటెంట్
ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తూ యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న
యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రంతో మరో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను
ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు
రానుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్ : సత్య జి
సంగీతం : శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం : కృష్ణ కాంత్
కొరియోగ్రాఫర్స్ : యష్, విజయ్ పోలంకి
నిర్మాణం : యూవీ
కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం : అనిల్ కుమార్ ఆళ్ల