గేమ్ ఛేంజర్ చిత్రం జరగండి పాట విడుదల

Published On: March 26, 2024   |   Posted By:

గేమ్ ఛేంజర్ చిత్రం జరగండి పాట విడుదల

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి సౌతిండియన్ సినిమాలకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిన డైరెక్టర్ శంకర్. ఆయన డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తారనగానే మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడసాగారు.సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. మూవీని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

గొప్ప సినిమాలను అందించాలనే తపనపడి, ఎంతటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధపడే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ తోడు కావటంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అందరి అంచనాలను మించేలా రూపొందిస్తున్నారు. ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతం అని అందరూ మెచ్చుకోవాలనేలా సినిమాలు తీయటం శంకర్ అలవాటు. రామ్ చరణ్‌కి వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు స్టార్ డైరెక్టర్.
ఈ నేపథ్యంలో మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం అందిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి  బుధవారం ఉదయం 9 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి..’ అనే పాటను విడుదల చేస్తున్నారు.
150 థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు:

రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ-శ్రీమతి అనిత, బ్యానర్స్ – శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీస్టూడియోస్, నిర్మాతలు – దిల్ రాజు, శిరీష్, సినిమాటోగ్రఫీ – తిరుణ్ణావుక్కరసు, సంగీతం – ఎస్.ఎస్.తమన్, యాక్షన్ – అన్బరివు, కథ – కార్తీక్ సుబ్బరాజు, డైలాగ్స్ – సాయి మాధవ్ బుర్రా, ఆర్ట్ – అవినాష్ కొల్ల, రామకృష్ణ, మోనిక, కొరియోగ్రఫీ – ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండి, పాటలు – రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, వి.ఎఫ్.ఎక్స్ – శ్రీనివాస్ మోహన్, ఆడియో – సరిగమ మ్యూజిక్, పి.ఆర్.ఓ – నాయుడు సురేంద్ర కుమార్