ప్రియదర్శి హీరోగా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ మూవీ అనౌన్స్ మెంట్

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP) ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేశారు. తన కెరీర్‌లో వరుసవిజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని  SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ చిత్రంతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

In Pic: Priyadarshi

In Pic: Priyadarshi

బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రియదర్శికి వండర్ ఫుల్ ఫిల్మ్స్ లైనప్ లో వున్నాయి.

ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్  స్టొరీ, ఇందులో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీది ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమా ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోందో తెలియజేస్తుంది.

జాన్వీ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ మార్గదర్శకత్వంలో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ  చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. నిర్మాణంలో అపార అనుభవం, స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు రానా దగ్గుబాటి లాంటి స్టార్‌ సపోర్ట్ చేయడం జాన్వీ గుడ్ లక్.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్.

తారాగణం: ప్రియదర్శి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్

నిర్మాత: జాన్వీ నారంగ్

బ్యానర్లు: SVCLLP,  స్పిరిట్ మీడియా