టక్కర్ మూవీ రివ్యూ

Published On: June 9, 2023   |   Posted By:

టక్కర్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

సిద్దార్ద్ కు ఎప్పుడో చాలా కాలంతెలుగులో బొమ్మరిల్లు తో హిట్ వచ్చింది. అది ఎంత పెద్ద హిట్ అంటే ఇప్పటికి ఆ సినిమాలో క్లైమాక్స్ డైలాగుకు పేరడీలు వస్తున్నాయి. అప్పటి నుంచి సిద్దార్ద్ ఆ ఇమేజ్ నుంచి బయిటకు రాలేక, ముందుకు వెళ్లలేక సతమతమవుతూ రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా మాస్ హీరోగా సెటిల్ అయ్యిపోదామని మహాసముద్రంలో దూకాడు. మునిగిపోయినా మాస్ జపమే కంటిన్యూ చేస్తూ ఇదిగో టక్కర్ అంటూ మన ముందుకు వచ్చాడు. తెలుగు,తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం సిద్దార్ద్ కు హిట్ ఇచ్చిందా?

కథ ఏంటి :

గుణశేఖర్ (సిద్దార్థ్) డబ్బు చాలా అవసరంకోరిక,పిచ్చి.కానీ అది సమకూరే వనరులు అయితే లేవు. దాంతో వైజాగ్ వెళ్లి కారు డ్రైవర్ గా జీవితం ప్రారంభిస్తాడు. అయితే అక్కడో అమ్మాయిలను ఎత్తుకొచ్చి అమ్మేసే గ్యాంగ్. దాని లీడర్ రాజ్‌ (అభిమన్యు సింగ్‌) . వాళ్లతో గుణకు చిన్న విషయంలో గొడవ వస్తుంది. దాంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్దితిలో ఆ గ్యాంగ్ ని చితక్కొట్టి వాళ్ల కారుని ఎత్తుకొచ్చేస్తాడు. ఆ కారుడి క్కీలో లక్కీ అలియాస్‌ మహాలక్ష్మీ (దివ్యాంశ కౌశిక్‌) ఉంటుంది. ఆమెను కిడ్నాప్ చేసారని అర్దమవుతుంది. అక్కడ నుంచి గుణఆమెతో జర్నీ ప్రారంభిస్తాడు. ఆమె గుణ కు ఆపోజిట్ క్యారక్టర్, బ్యాక్ గ్రౌండ్ .కోటీశ్వరరావు అయిన ఆమె తన పెద్దవాళ్లు పెళ్లి చేస్తూంటే పారిపోయి వచ్చేసింది. అక్కడ నుంచి గుణకు, ఆమెకు మధ్య లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అది ఏ తీరానికి చేరుకుంది. ఫైనల్ గా ఏమైంది. తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ :

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ తప్పిస్తే ఈ సినిమా ఏ విధంగానూ ఎక్సైట్ చేయదు. ముఖ్యంగా సినిమాకు కీలకంగా నిలవాల్సిన సెకండాఫ్ అయితే దారుణంగా ఉంది. నేరేషన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఒకదానికొకటి బోర్ కొట్టించటంలో పోటీ పడ్డాయి. అందుకు కారణం సినిమాలో మెయిన్ విలన్ అంటూ ఒకరు లేకపోవటమే. సిద్దార్ద్ ని దారుణంగా కొట్టే కారు ఓనర్ ని విలన్ గా తీసుకోవాలా లేక అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేసే వాడిని విలన్ గా తీసుకుని ఫాలోకావాలాఏదీ అర్దం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా సిద్దార్ద్ క్యారక్టరైజేషనే ఓ విలన్ లా అనిపిస్తుంది. ఆ పాత్రలో నెగిటివ్ నెస్ ఉంటుంది. దాన్ని అధిగమించటమే కథ అనుకుంటే మిగతా ఉప కథలకు అంత ప్రయారిటీ ఇవ్వల్సిన పనిలేదు. పోనీ ఇది హీరో,విలన్ కథకాదు. అలాగని హీరో,హీరోయిన్ కథ కాదుకిచిడిగా అన్ని కలిపి వండేసారు. ఎటు నుంచి ఎటు ఈ కథ వెల్తుందో అర్దం కాదు. కథకు సరైన డైరక్షన్ అంటూ ఉంటే మిగతావన్నీ కలిసి వచ్చేవి. స్క్రీన్ ప్లే లోనే సమస్య ఉండటంతో ఆ విషయంలో క్లారిటీ రాలేదు. అందుకు తగినట్లు చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం నడుస్తూంటాయి.ఎక్కడా కొత్తదనం అనేది ఉండదు. ఇలాంటి కథను కేవలం సిద్దార్ద్ కొత్త గెటప్ లో ఉన్నాడని చూడలేం కదా.

నటీనటుల ఫెరఫార్మెన్స్ :

సిద్దార్థ్ ఓ రకంగా సినిమా మొత్తం మోసాడని చెప్పాలి. కొత్త లుక్ ఇచ్చారు కానీ వర్కవుట్ కాలేదు. దివ్యాంశ కౌశిక్ గ్లామరస్ గా ఉందికానీ క్యారక్టర్ సరిగ్గా లేదు. విలన్ అభిమన్యు సింగ్ ఎప్పటిలాగే తన పాత్ర రొటీన్ గానే చేసారు. యోగి బాబు కు రచ్చ రవితో డబ్బింగ్ చెప్పించారు. కుదరలేదు. చాలా మంది తమిళ నటులే. దాంతో చాలా మంది రిజిస్టర్ కూడా కావు.

టెక్నికల్ గా :

సాధారణంగా సిద్దార్ద్ సినిమాలు టెక్నికల్ గా సౌండ్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా జస్ట్ ఓకే అన్నట్లుంది. పాటల్లో గుర్తించుకోదగినిది ఒకటీ లేదు. ఎడిటింగ్ బోర్ కొట్టించే రీతిలో సీన్స్ వదిలేసారు. డైరక్టర్ సరైన స్క్రిప్టు ఎంచుకోవటంలో తడబడిఇబ్బంది పెట్టారు. యాక్షన్ ఎపిసోడ్సే సినమాకు హైలెట్

చూడచ్చా?

బోర్ చిత్రాలపై రీసెర్చ్ చేద్దామనే పోగ్రామ్ పెట్టుకుంటే తప్పించి ఈ సినిమాని చూడాలని ఆవేశపడటం అనవసరం.

నటీనటులు :

సిద్దార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్ కాంత్, ఆర్జే విగ్నేశ్వర్ తదితరులు

సాంకేతికవర్గం :

సంగీతం: నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేషన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్షన్: ఉదయ కుమార్ కే
స్టంట్స్: దినేష్ కాశీ
రచన, దర్శకత్వం: కార్తీక్ జీ క్రిష్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల
రన్ టైమ్ : 139 మినిట్స్
రిలీజ్ డేట్: 2023-05-26