టెనెంట్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల

Published On: October 28, 2023   |   Posted By:

టెనెంట్ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల

సత్యం రాజేష్ టెనెంట్ టైటిల్ గ్లింప్స్ విడుదల

కమెడియన్‌గా, నటుడిగా అందివచ్చిన అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్. ఇప్పుడాయన హీరోగా నటించిన మా ఊరి పొలిమేర -2 చిత్రం ఈ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా తాజాగా ఆయన నటించిన మరో చిత్రం టెనెంట్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ టెనెంట్ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అద్భుతం చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

నటీనటులు :

సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న

సాంకేతికవర్గం :

మ్యూజిక్ : సాహిత్య సాగర్
డి.ఓ.పి: జెమిన్ జోం అయ్యనీత్,
ఎడిటర్: విజయ్ ముక్తవరపు,
ప్రొడ్యూసర్: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి,
స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: వై. యుగంధర్