డంకీ మూవీ డిసెంబర్ 21 విడుదల

Published On: December 20, 2023   |   Posted By:

డంకీ మూవీ డిసెంబర్ 21 విడుదల

దుబాయ్‌లో షారూక్ ఖాన్ డంకీ ఫీవర్ బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకున్న డ్రోన్ షో

కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం డంకీ. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని అందరూ ఎంతో ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అందులో భాగంగా ఆయన బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా, ఓ మాహి పాటలకు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈవెంట్‌లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు.డ్రోన్ షోతో ఆకాశమంతా వెలుగులు నిండిపోయాయి. అది చూస్తున్న అభిమానులు చక్కటి అనుభూతికి లోనయ్యారు.

డంకీ ప్రమోషన్‌లో భాగంగా దుబాయ్ చేరుకున్న షారూక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. దుబాయ్‌లోని వోక్స్ సినిమాస్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న కింగ్ ఖాన్‌కి అభిమానులు అద్భుతంగా స్వాగతం పలికారు.

తనదైన స్టైల్లో షారూక్ గ్లోబల్ విలేజ్ దుబాయ్‌లో బిజీగా ఉన్నారు. సినిమాపై అంచనాలను పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డంకీ డైరీస్ కార్యక్రమంలో ఎస్ఆర్‌కె, రాజ్ కుమార్ హిరాని, తాప్సీ పాల్గొన్నారు. అలాగే ప్రేక్షకులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే డంకీ డ్రాప్ 6గా బందా అనే పాటను రాజ్ కుమార్ హిరాని విడుదల చేశారు. ఇందులో హార్డి పాత్రను కొత్తగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గురువారం డంకీ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డంకీ ఫీవర్ పీక్స్‌కి చేరుకున్నాయి. దీన్ని మరో మెట్టుకు తీసుకెళ్లటానికి షారూక్ తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.

డంకీ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.