డిస్కో రాజా షూటింగ్ చివరి దశ

Published On: October 31, 2019   |   Posted By:
డిస్కో రాజా షూటింగ్ చివరి దశ
 
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన

మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది..తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో S. P. బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ అతి త్వరలో విడుదల చేస్తారు..



న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

ప్రొడక్షన్ – రామ్ తళ్లూరి

సమర్పణ – సాయి రిషిక

నిర్మాత : రజిని త‌ళ్లూరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్. ఎస్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి