డైరెక్టర్ పరశురామ్ పెట్ల బర్త్ డే వేడుకలు

Published On: December 27, 2023   |   Posted By:

డైరెక్టర్ పరశురామ్ పెట్ల బర్త్ డే వేడుకలు

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల బర్త్ డే సెలబ్రేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు

స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. ఇవాళ పరశురామ్ పెట్ల బర్త్ డేను ఘనంగా నిర్వహించారు హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పేరెంట్స్ వర్థన్ దేవరకొండ, మాధవి కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆయనకు బర్త్ డే విశెస్ చెప్పారు. ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్ మెంబర్స్ అంతా తమ కెప్టెన్ ఆఫ్ ది షిప్ పరశురామ్ పెట్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54న సినిమా ఇది. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు :

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాతలు : రాజు శిరీష్
రచన, దర్శకత్వం పరశురామ్ పెట్ల