దేవిశ్రీప్రసాద్ బి ద రియల్ మాన్ ఛాలెంజ్

Published On: April 30, 2020   |   Posted By:

దేవిశ్రీప్రసాద్ బి ద రియల్ మాన్ ఛాలెంజ్

ఆకట్టుకుంటున్న రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ‘బి ద రియల్ మాన్ ఛాలెంజ్’ వీడియో.
దర్శకుడు సుకుమార్ విసిరిన ‘బి ద రియల్ మాన్ ఛాలెంజ్’ ను స్వీకరించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన వీడియో పోస్ట్ చేశారు. ఇంటిని శుభ్రపరిచి, తన తల్లి గారికి ఆమ్లెట్ వేసి, తండ్రి గారైన సత్యమూర్తి గారి ఫోటోలను తుడిచి ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశారు దేవి. చివరిగా ‘రియల్ మాన్’ లను తయారు చేస్తున్న ప్రతి తల్లికీ ఈ వీడియో అంకితం అంటూ ముగించారు. దేవి శ్రీ ప్రసాద్ పాపులర్ ట్యున్లు అయిన పౌర్ణమి, నాన్నకు ప్రేమతో లోని మ్యూజిక్ తో ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. Be The Real man ఛాలెంజ్ కు తన తరఫు నుండి అల్లు అర్జున్, కార్తీ, యష్, హరీష్ శంకర్ మరియు మోహన్ లాల్ లను నామినేట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్.