నారాయణ & కో మూవీ ట్రైలర్

హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసిన సుధాకర్ కోమాకుల, చిన్నా పాపిశెట్టి, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా నారాయణ & కో  ట్రైలర్

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారాయణ అండ్ కో జూన్ 30న విడుదల కానుంది. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు.

నెక్స్ట్ టెన్ డేస్ లో చాలా పెద్ద డీల్ వుంది. దుబాయ్ నుంచి ముంబాయికి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్ గా మన దగ్గరకు చేర్చాలి అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.

నారాయణ కుటుంబంలో పాత్రలన్నీ చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. ట్రైలర్ లోచెప్పినట్లు నారాయణ & కో ధెడ్ దిమాక్ & తిక్కల్ బ్యాచ్. ట్రైలర్ అన్ లిమిటెడ్ ఫన్ ని అందించింది. ట్రైలర్ చివర్లో పిల్లి బొమ్మ చుట్టూ నడిపిన సన్నివేశాలు హిలేరియస్ కామెడీని అందించాయి.

సుధాకర్ కోమాకుల తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. దేవి ప్రసాద్ ,ఆమనీ పాత్రలు కూడా మంచి వినోదాన్ని పంచాయి. నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి నారాయణ & కో ట్రైలర్.. ఈ చిత్రం అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అని భరోసా ఇచ్చింది.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం :

సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

సాంకేతిక విభాగం :

బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
నిర్మాతలు: పాపిశెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల
సంగీతం: సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల & నాగ వంశీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
డీవోపీ: రాహుల్ శ్రీవాత్సవ్