నా సామిరంగ మూవీ మిర్నా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: January 5, 2024   |   Posted By:

నా సామిరంగ మూవీ మిర్నా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కింగ్ నాగార్జున అక్కినేని, విజయ్ బిన్ని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నా సామిరంగ నుంచి మంగ గా మిర్నా మీనన్ పరిచయం

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ నా సామిరంగ నుంచి మంగ పాత్రలో మిర్నా మీనన్ ను పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మిర్నా మీనన్ సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో చాలా అందంగా కనిపించారు.

మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్ గా వున్నాయి.

ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.

తారాగణం :

కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: శివేంద్ర దాశరధి