నీ చిత్రం చూసి చిత్రం టీజర్ విడుదల

Published On: June 14, 2022   |   Posted By:

నీ చిత్రం చూసి చిత్రం టీజర్ విడుదల

MMK క్రియేషన్స్ వారి “నీ చిత్రం చూసి” – “టీజర్ “ని MAA అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు ఆవిష్కరించారు.

మురళి, శివాని నాయుడు హీరో హీరోయిన్లుగా మహీంద్రా బషీర్ దర్శకత్వంలో MMK క్రియేషన్స్ బ్యానర్ పై మురళి మోహన్ .కే నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా “నీ చిత్రం చూసి”. ప్రేమ కథ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కి సతీష్ ముదిరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినయ్ శశిధర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఈ చిత్రంకు సంబంధించిన “టీజర్ “ని ఇటివల,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షులు “శ్రీ మంచు విష్ణు”గారు Launch చేయగా,చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ,శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు (ఏపీ మాజీ మంత్రి కార్మిక శాఖ మంత్రులు) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గాలి శ్రీనివాస్ యాదవ్ గారు,ఈ చిత్ర సంగీత దర్శకుడు వినయ్ శశిధర్, ఎడిటర్ MNR,
తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు
మురళి, శివాని నాయుడు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: MMK క్రియేషన్స్
దర్శకత్వం: మహీంద్రా బషీర్
నిర్మాత: మురళి మోహన్ .కే
సంగీతం: వినయ్ శశిధర్
డి.ఒ.పి : సతీష్ ముదిరాజ్