నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ రివ్యూ

Published On: September 16, 2022   |   Posted By:
నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ రివ్యూ
 
 

Emotional Engagement Emoji (EEE)

 
👎
 

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు  కిరణ్ అబ్బ‌వ‌రం. ఎంతసేపూ తనను తాను మాస్ హీరోలా ప్రెజెంట్ చేసుకోవాలనే తపనతో ఉండే ఈ హీరో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తూ ఈ సినిమా చేసారు. డబ్బింగ్ సినిమా టైటిల్ ని గుర్తు చేసే ఈ సినిమా ఎలా ఉంది…వర్కవుట్ అయ్యే కథ,కథనమేనా …అదిరిపోయే ట్విస్ట్ లు అని ప్రచారం చేస్తున్నారు..అందులో నిజమెంత ..అవేంటో చూద్దాం.

కథాంశం:
తేజు (సంజన ఆనంద్) ఒంటిరిగా ఉంటూంటుంది. తాగుతూంటుంది. ఆమెను డ్రాప్ చేస్తూంటాడు మన హీరో వివేక్ (కిరణ్ అబ్బవరం) ఓ   క్యాబ్ డ్రైవర్ . రెగ్యులర్ గా  ఆమెను తన క్యాబ్ లో డ్రాప్ చేస్తూంటాడు.   ఒకరోజు…ఈ అమ్మాయి ఏమిటి రోజూ మందేసి క్యాబ్ ఎక్కుతోంది అని డౌట్ వచ్చి క్యూరియాసిటీతో అడిగేస్తాడు. అప్పుడు ఆమె ఓ ప్లాష్ బ్యాక్ విప్పుతుంది.తను ఒకరిని ప్రేమించానని, అతనికోసం పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చానని, కానీ మోసం చేసాడని వాపోతుంది. అప్పుడు వివేక్ ..కావాల్సినంత సానుభూతి చూపించి..ఆమెను తన తెలివితో ఆమె కుటుంబానికి దగ్గర చేస్తాడు. ఆ ప్రాసెస్ లో బాబు కు కూడా దగ్గర అవుతుంది. అతనికి తన ప్రేమను చెప్పాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు అతను వివేక్ కాదు..నవీన్ అని తెలుస్తుంది. ఎందుకిలా పేరు మార్చుకున్నాడు..అతను గతం ఏమిటి..క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారాడు… ఆమె అంతకు ముందే అతనికి తెలుసా…చివరకు ఈ ప్రేమ కథ ఏ తీరం చేరింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పాత మసాలా కమర్షియల్ సినిమాలు కొన్ని చూసి వండిన స్క్రిప్టు ఇది. ఆ స్కీమ్ కు  బాగా అలవాటు పడిపోయి.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లతోనే సినిమాలు నింపేసి మన మీదకు వదిలేసాడు కిరణ్. ఇదే ఫార్మెట్ లో వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపం వర్కవుట్ అయిందని.. ఈ సినిమా కూడా ఇలాగే చేసాడు. ఎక్కడా కమర్షియల్ మీటర్ తప్పకుండా నడుపుతాడు. ఎన్నో సార్లు చూసిన సీన్స్, విన్న డైలాగులు మన ముందు ప్రత్యక్ష్యమవుతుంటే మనకు ఆశ్చర్యమేస్తుంది. మారుతున్న సినిమాని ఈ కుర్రాడు పట్టించుకోడా అనిపిస్తుంది. ఎక్కడా కథ,స్క్రీన్ ప్లే వంటి విషయాలకు అసలు అవకాసం ఇవ్వడు. దానికి తోడు ఫస్టాఫ్ మొత్తం క్యారక్టర్స్ ఇంట్రడక్షన్..హీరోయిన్ తో జర్నీ..ప్లాష్ బ్యాక్ లీడ్ . దాంతో ఇంటర్వెల్ అయ్యేదాకా తెరపై ఏం జరుగుతుందో అర్దం కాదు. అప్పటిదాకా హీరో, హీరోయిన్ ఎంట్రీ, సమయం సందర్బం లేకుండా వచ్చే యాక్షన్ సీక్వెన్స్.. నాలుగు కామెడీ సీన్స్.. టక్కున ప్రేమలో పడిపోవడం.. ఓ ట్విస్ట్.. ఇంటర్వెల్.. ఈ ఫార్మెట్ కథకు ఆ ట్విస్ట్ ఏమైనా కలిసొచ్చిందా అంటే అదీ లేదు. సెకండాఫ్ లోనూ ఓ ట్విస్ట్. ట్విస్ట్ లు విడిగా బాగున్నా…అవి షార్ట్ ఫిల్మ్ లలో వచ్చే ట్విస్ట్ లుగా అనిపిస్తాయి తప్పించి ఎక్కడా ఫీల్ కాము.  ఇలా తలా తోకా లేని ఓ పాత కాలం సినిమా చూసిన ఫీలింగ్ తెస్తుంది ఈ కథ,కథనం.

టెక్నికల్ గా…

ఈ సినిమా టెక్నికల్ గానూ నాశిరకంగానే అనిపిస్తుంది. పెద్ద స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్లు అనిపించదు.మణిశర్మ సంగీతం రొటీన్‌గా రొట్టగా అనిపిస్తుంది. మరీ డైరక్టర్ కూడా ఇలాంటి రొటీన్ కథకు అలాంటి పాటలే కావాలని కోరుకున్నాడేమో…ఎక్కడా  కొత్తదనం కనిపించలేదు. ఆర్ఆర్ రాజ్ కే నల్లి సినిమాటోగ్రఫీ  జస్ట్ ఓకే. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు ఎడిటింగ్ చేసారా అని చాలా సార్లు డౌట్ వస్తుంది. డైరక్టర్ ఇంతోటి కథను చాలా స్లో నేరేషన్ లో ఏదో ఫీల్ గుడ్ కథను చెప్పినట్లు చెప్పే ప్రయత్నం చేసారు.. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ కూడా  దారుణం.  స్క్రీన్ ప్లే అయితే చెప్పక్కర్లేదు.

నటీనటుల్లో …కిరణ్ అబ్బవరంలో మంచి ఈజ్ ఉంది.కానీ దాన్ని సరైన కథతో ముందుకు తీసుకెళ్లటం లేదు. బిల్డప్, ఎలివేషన్స్ తప్ప. సరైన ఎక్సప్రెషన్స్ పలకటం లేదు.    హీరోయిన్ సంజన ఆనంద్ బాగుంది.  బాబా భాస్కర్ కామెడీ ఏతో తమిళ సినిమాలోంచి ఆ క్యారక్టర్ వచ్చినట్లు అతిగా అనిపిస్తుంది.  ఎస్వీ కృష్ణారెడ్డి, సోనూ ఠాకూర్, సమీర్ తదితరులు బాగా చేసారు.

చూడచ్చా?

అప్పట్లో జబ్ వుయ్ మెట్ , కృష్ణ వంశీ శశిరేఖా పరిణయం నాటి కథ,కథనం..అలాగని మరీ ఆ సినిమాల స్దాయిలో ఊహిస్తే బోల్తా పడతారు.

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌, సిధ్ధార్ద్‌ మీనన్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సమీర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: కోడి దివ్య దీప్తి
దర్శకత్వం : శ్రీధర్‌ గాదె
మాటలు, స్క్రీన్‌ప్లే: కిరణ్‌ అబ్బవరం
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫి: రాజ్‌ నల్లి
Running time: 130 minutes
విడుదల తేది: సెప్టెంబర్‌ 16, 2022