పుష్పక విమానం మూవీ సిలకా సాంగ్ రిలీజ్

Published On: March 14, 2021   |   Posted By:
పుష్పక విమానం మూవీ సిలకా సాంగ్ రిలీజ్
 
మార్చి 15న పుష్పక విమానం నుండి  సిలకా’ సాంగ్ రిలీజ్
 
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూడో సినిమా “పుష్పక విమానం” రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ను ఈ నెల 15న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
 
ఈ మధ్య బాగా పాపులర్ అయిన రామ్ మిరియాల ఈ సినిమాకు ఓ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ‘‘సిలకా’’ అనే సాంగ్ ను ఆయనే కంపోజ్ చేశాడు. పాట కూడ ఆయనే పాడాడు.అంతే కాదు.ఈ సాంగ్ లో కూడా డాన్స్ మాస్టర్ రఘు తో కలిసి చిందేయబోతున్నాడు. ఆ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేయబోతున్నారు.దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో జరిగింది. ఈ పోస్టర్ లో హీరో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ గీత్ సాయిని పెళ్లి దుస్తుల్లో ఉండగా రామ్ మిరియాల,రఘు మాస్టర్ బ్యాండ్ వేళం వాయిస్తూ కనిపిస్తున్నారు. వీళిద్దరూ చమన్ బ్రదర్స్ గా ఈ సాంగ్ లో కనిపిస్తారు.
 
దామోదర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. 
 
నటీనటులు:
ఆనంద్ దేవరకొండ,గీత్ సైని,శాన్వి మేఘన,సునీల్,నరేష్,హర్షవర్థన్,గిరిధర్,కిరీటి,భద్రం,వైవా హర్ష,అభిజిత్,అజయ్,సుదర్శన్,శరణ్య,మీనా వాసు,షేకింగ్ శేషు
 
టెక్నికల్ టీమ్:
సమర్పణ : విజయ్ దేవరకొండ
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
ఎడిటర్ : రవితేజ గిరిజాల,
మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
కాస్టూమ్స్ : భరత్ గాంధీ
నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర