ప్రియ‌ద‌ర్శి మీడియాతో ముచ్చ‌ట

Published On: March 14, 2021   |   Posted By:
ప్రియ‌ద‌ర్శి మీడియాతో ముచ్చ‌ట
 
మా స్నేహమే  సిల్వర్‌స్క్రీన్‌పై  రిఫ్లెక్ట్‌ అయ్యింది – ప్రియ‌ద‌ర్శి
 
నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన‌ చిత్రం ‘జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి  నాగ్ అశ్విన్ నిర్మాత.  ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందు వ‌చ్చి హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పేరు తెచ్చ‌కుని మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా న‌టుడు ప్రియ‌ద‌ర్శి మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..
 
*జాతిరత్నాలు’ కథను నా కంటే ముందు రాహుల్‌ రామకృష్ణ విన్నాడు. కథ విని..చాలా బాగుంది. చాలా ఎంజాయ్‌ చేశానని చెప్పాడు. మా మేనేజర్‌ సీతారామ్  ద్వారా నేను కూడ కథ విన్నాను. అనుదీప్‌ కథ చెబుతున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను.
 
*ఈ సినిమాలో నేను శేఖర్‌ పాత్ర చేశాను. నా  పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఫోన్లు, మేజేస్‌లు చేస్తున్నారు. ఆడియన్స్‌ నవ్వరేమో అని మేం అనుకున్న‌ సన్నివేశాలను కూడా వారు ఏంజాయ్‌ చేస్తున్నారు. క్లీన్‌ కామెడీ మూవీ. అసభ్యకరమైన కామెడీ సినిమాలో లేదు. జంథ్యాలగారు ఎక్కడి నుంచో అనుదీప్‌ను ఆశీర్వదించారు అనిపిస్తోంది. కొంతమంది ఈ సినిమా చాలు. వ్యాక్సిన్‌ వద్దు అని సరదగా మేసేజ్‌ చేశారు. అలా వ్యాక్సిన్‌ వద్దని కాదండోయ్‌. వ్యాక్సిన్‌ వేసుకోండి. థియేటర్స్‌కు వెళ్లేప్పుడు మాస్క్‌లు, శానిటైజర్స్ కూడా వాడండి.
 
*అనుదీప్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన తరవాత అంతా బాగానే ఉంది. షూటింగ్‌ చేస్తున్నాం. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు యాక్సెప్ట్‌చేస్తారా? అనిపించింది. కానీ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత మాలో నమ్మకం వచ్చింది. అందరం కలిసి ఆన్‌సెట్స్‌లో సీన్స్‌ను ఇంప్రూవైజ్‌ చేశాం. ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా టైమింగ్‌ మెయిన్‌టెన్ చేశాం. కొన్ని సీన్స్‌కు మేం చేసిన రిహార్సల్స్‌ బాగా ఉపయోగపడ్డాయి.
 
*నవీన్‌ నాకు రెండు సంవత్సరాల నుంచి తెలుసు. రాహుల్‌తో నాకు పదేళ్ల పరిచయం ఉంది. మా స్నేహమే సిల్వర్‌స్క్రీన్‌పై రిప్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. ఉంటుంది. బ్రహ్మానందంగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీ. ఇదివరకు ఓ సినిమా
చేశాను. సెట్స్‌లో ఆయన నాకు కొన్ని విలువైన విషయాలు చెప్పారు.
 
*మొదట్లో నాకు ఇండస్ట్రీలో ప్లేస్‌ కోసం ప్రయత్నించాను.  విలన్, హీరో, కమేడియన్‌ అని కాదు మంచి నటుడిగా ప్రేక్షకులు నన్ను గుర్తించాలని అనుకుంటున్నాను. నాకు ఎస్వీరంగరావుగారు, కోట శ్రీనివాసరావుగారు, ప్రకాశరావుగారిలా యాక్టింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం.
 
*జాతిరత్నాలు ట్రైలర్‌ను ప్రభాస్‌గారు విడుదల చేశాను. విజయ్‌ మా సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చారు. మహేశ్‌బాబుగారు, అల్లు అర్జున్‌గారు మా సినిమా బాగుందని ట్వీట్స్‌ చేశారు. ఎఫ్‌2 సందర్భంలో వెంకటేష్‌గారు మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో చిరంజీవిగారు అభినందించారు. 
 
*నా భార్య రైటర్‌. త‌ను నావెల్స్ రాస్తుంటుంది. తనతో అప్పుడ‌ప్పుడు సినిమాల గురించి డిస్కస్స్‌ చేస్తుంటాను. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటుగా ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నాను.