ప్రేమకథ మూవీ జనవరి 5విడుదల

Published On: December 27, 2023   |   Posted By:

ప్రేమకథ మూవీ జనవరి 5విడుదల

జనవరి 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ప్రేమకథ

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమకథ సినిమా జనవరి 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ దాకా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ప్రేమకథ సినిమా. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఎవడు మనోడు… లిరికల్ సాంగ్ తో పాటు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన ప్రేమకథ సినిమాకు థియేటర్స్ లోనూ మంచి ఆదరణ దక్కుతుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు :

కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు

టెక్నికల్ టీమ్ :

డీవోపీ : వాసు పెండెం
మ్యూజిక్ : రధన్
ఎడిటర్ : ఆలయం అనిల్
బ్యానర్స్ : టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్
నిర్మాతలు : విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్
రచన: దర్శకత్వం  శివశక్తి రెడ్ డీ