ప్రేమ అనే నేను మూవీ షూటింగ్ పూర్తి

Published On: June 15, 2023   |   Posted By:

ప్రేమ అనే నేను మూవీ షూటింగ్ పూర్తి

వరల్డ్ ఫోక‌స్ పిక్చర్ ప‌తాకంపై ఆర్.కె బ్రోస్ సమర్పణలో బాసి ద‌ర్శ‌క‌త్వంలో బి.స‌తీష్ నిర్మిస్తోన్న చిత్రం ప్రేమ అనే నేను. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో నిర్మాత బి.స‌తీష్ మాట్లాడుతూ కొత్త ఆర్టిస్ట్ ల‌తో ఈ సినిమా చేశాం. కాకినాడ‌, ఉప్పాడ‌, మ‌చిలీప‌ట్నం, వైజాగ్ స‌ముద్ర ప్రాంతాల్లో చేశాం. టీమ్ అంతా చాలా బాగా స‌పోర్ట్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో వ‌చ్చే చిత్రాలను ఆద‌రిస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నా అన్నారు.

ద‌ర్శ‌కుడు బాసి మాట్లాడుతూ సినిమా చాలా బాగా వ‌చ్చింది. మంచి కాన్సెప్ట్ తో వ‌స్తోన్న చిత్ర‌మిది అన్నారు.

క‌థానాయ‌కుడు ఆర్ కె బ్రోస్ మాట్లాడుతూఓ గ్రామీణ ప్రాంతంలో ఉండే కుర్రాడిగా న‌టించాను. ఆడిష‌న్ ద్వారా న‌న్ను హీరోగా తీసుకున్నారు. మా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించారు. ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతోన్న మ‌మ్మ‌ల్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.

సాంకేతికవర్గం :

సినిమాటోగ్ర‌ఫీ : స‌త్య (నాని)
ఎడిట‌ర్ః నాగిరెడ్డి
మ్యూజిక్ : నింషి జ‌క్కాయ‌స్
నిర్మాత : బి.స‌తీష్‌
క‌థ‌-మాట‌లు-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కత్వం : బాసి