ప్లాంట్ మ్యాన్ మూవీ ట్రైలర్ విడుదల

Published On: December 29, 2023   |   Posted By:

ప్లాంట్‌ మ్యాన్‌ మూవీ ట్రైలర్‌ విడుదల

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్లాంట్‌ మ్యాన్‌ ట్రైలర్‌ రిలీజ్‌

కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ఇప్పుడు నిర్మాతగా మారి డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై ప్లాంట్‌ మ్యాన్‌ అనే ఒక విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. మంచి డైలాగ్స్‌, మంచి కామెడీ సిట్యుయేషన్స్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ఈమధ్యకాలంలో ఫుల్‌లెంగ్త్‌ కామెడీ సినిమాలు చాలా తక్కువయ్యాయి. ఆ లోటును ప్లాంట్‌ మ్యాన్‌ తీరుస్తుందని మేకర్స్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
డైరెక్టర్‌ పన్నా రాయల్‌.. డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ సంస్థను స్థాపించి కొత్తవారిని ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ప్లాంట్‌ మ్యాన్‌ అనే సినిమాను నిర్మిస్తూ కె.సంతోష్‌బాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది.

ప్లాంట్‌ మ్యాన్‌ చిత్రం గురించి నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు నా డైరెక్షన్‌లో హారర్‌ బేస్డ్‌ మూవీస్‌ చేశాను. నేను నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాను కామెడీ బ్యాక్‌డ్రాప్‌లోనే చెయ్యాలనుకున్నాను. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు చక్కని కామెడీ ఉంటుంది. అంతేకాకుండా ఒక కొత్త ఎలిమెంట్‌ కూడా ఈ సినిమాలో ఉంది. అందుకే ఈ సినిమాకి ప్లాంట్‌ మ్యాన్‌ అనే టైటిల్‌ని పెట్టడం జరిగింది. ఆ ఎలిమెంట్‌ ఆడియన్స్‌ని బాగా థ్రిల్‌ చేస్తుంది. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చెయ్యాలని నిర్ణయించాము. దీని తర్వాత కూడా మా బేనర్‌లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం అన్నారు.

నటీనటులు :

చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్‌, లక్ష్మీకిరణ్‌, శేఖర్‌, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌
సంగీతం: ఆనంద బాలాజీ
ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం
నిర్మాతదర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్‌
దర్శకత్వం: కె.సంతోష్‌బాబు