బూట్‌కట్ బాలరాజు మూవీ సాంగ్ విడుదల

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంచ్ చేసిన సోహెల్, శ్రీ కోనేటి, ఎండీ పాషా బూట్‌కట్ బాలరాజు తాగుదాం తాగి ఊగుదాం సాంగ్

బిగ్‌‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎండీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి తాగుదాం తాగి ఊగుదాం పాటని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ నెంబర్ నెంబర్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ మాస్ ఎనర్జీ తో పాడిన ఈ పాటకు అఫ్రోజ్ అలీ క్యాచి లిరిక్స్ అందించారు. ఈ పాటలో సోహెల్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు కెమరామెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు :

సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, కొత్త బంగారు లోకం వివేక్

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: శ్రీ కోనేటి
నిర్మాత: ఎండీ పాషా
బ్యానర్లు: గ్లోబల్ ఫిల్మ్స్ & కథా వేరుంటది
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: విజయ్ వర్ధన్