బ్రో మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

తండ్రి మరణం తర్వాత ఇంటికి పెద్ద కొడుకైన మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయి ధరమ్ తేజ్) ఇంటి బాధ్యతలన్నీ సిన్సియర్ గా నిర్వర్తిస్తుంటాడు. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు వుంటారు. పెద్ద చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముడు ఉద్యోగంలో మరింత స్థిరపడాలని ఇలా అన్ని విషయాల్లో అమ్మకి తోడుగా అన్నీ తానై చూస్తుంటాడు. మార్క్ ఒక టెక్స్ టైల్ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తూ, అదే కంపెనీలో మరింత ఉన్నత స్థితిలో వుండాలని శ్రమిస్తుంటాడు. కానీ ఊహించని రీతిలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో మార్క్, దేవుడు (పవన్ కళ్యాణ్) / టైమ్ దగ్గర ప్రత్యక్షమవుతాడు. నాకు జీవితంలో చాలా భాద్యతలున్నాయని, నేను లేకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోతుందని , నేను మాత్రమే చేయాల్సిన పనులున్నయని, నన్ను ఇలా అర్ధాంతరంగా చంపడం అన్యాయమని దేవుడితో చెప్తాడు. చివరగా దేవుడు ఒక 90 రోజులు తన జీవిత కాలాన్ని పెంచుతాడు. అలా మళ్లీ తిరిగి ఇంటికి చేరిన మార్క్, ఈ 90 రోజుల వ్యవధిలో తను అనుకున్నవన్నీ చేశాడా, తనను ప్రేమించిన అమ్మాయి (కేతిక శర్మ ) ని పెళ్లి చేసుకున్నాడా లేదా … అనేది మిగతా కథ

ఎనాలసిస్ :

వినోదయ సిత్తం ఒరిజినల్ కథని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరియు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పూర్తిగా స్క్రీన్ ప్లే మార్చి, తనదైన మాటలతో వినోదాత్మకంగా తీర్చిదిద్దటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సాయి ధరమ్ తేజ్, మార్క్ పాత్రలో చక్కగా చేశాడు. అక్కడక్కడా పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ ని సరైన సమయంలో వాడుకుంటూ థియేటర్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. ఓవరాల్ గా Bro సినిమా జీవిత సత్యాన్ని వినోదాత్మకంగా చక్కగా చెప్పారు. ఇది ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ.

ప్లస్ పాయింట్స్ :

పవనకళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్
త్రివిక్రమ్ స్క్రీన్ & మాటలు
పాటలు, బి జి ఎం

మైనస్ పాయింట్స్ :

పాత్రల మధ్య సంఘర్షణ

టెక్నికల్ గా :

బాగుంది

చూడచ్చా :

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు బాగా నచ్చుతుంది
మూవీ బాగుంది చూడచ్చు

సినిమా వివరాలు :

సినిమా టైటిల్ : బ్రో (BRO)
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
విడుదల తేదీ:-28-07-2023
సెన్సార్ రేటింగ్: “U/A”
తారాగణం : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి
దర్శకుడు: సముద్రఖని
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: TG విశ్వప్రసాద్
రన్‌టైమ్: 135 నిమిషాలు

మూవీ రివ్యూ : రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్