బ్లడ్ అండ్ చాక్లెట్ చిత్రం ఆడియో విడుదల
లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా  బ్లడ్ అండ్ చాక్లెట్ ఆడియో విడుదల
లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్  చిత్రాన్ని నిర్మించారు.
షాపింగ్ మాల్, ఏకవీర తదితర సెన్సిబుల్ చిత్రాలను రూపొందించి, జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న  వసంతబాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన  అర్జున్ దాస్  హీరోగా,  దుశారా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈ చిత్రం ఆడియోను డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
జి.వి. ప్రకాశ్ కుమార్  అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘వసంతబాలన్ సెన్సిటివ్ సబ్జెక్ట్ లను డీల్ చేస్తు వుంటారు.  ఈ సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. వసంతబాలన్ సెన్సిటివ్ కథాంశాన్ని టచ్ చేస్తూ, ఒక వైపు లవ్ మరో వైపు. సస్పెన్స్ కు రెండింటికి సమ న్యాయం చేస్తూ అద్భుతంగా రూపొందించారు’ అని అన్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో  జూలై 21న విడుదలకానుంది. తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ  చిత్రాన్ని విడుదల చేయనుంది.. ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ నాలుగు అద్భుతమైన పాటలు అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు వసంతబాలన్ చెప్పారు.  ఇంకా ఈ చిత్రంలో వనితా విజయ్ కుమార్, అర్జున్ చిదంబరం, సురేష్ చక్రవర్తి తదితరులు నటించారు.