మను చరిత్ర మూవీ పాట విడుదల

Published On: June 5, 2023   |   Posted By:

మను చరిత్ర మూవీ పాట విడుదల

శివ కందుకూరి, భరత్ పెదగాని, ప్రొద్దుటూరు టాకీస్ మను చరిత్ర నుంచి ఇప్పుడే పరిచయమే పాటని లాంచ్ చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్

యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ మను చరిత్ర. ఈ చిత్రంలో శివ సరసన మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో విడుదల చేసిన టీజర్ శివ కందుకూరిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసి క్యురియాసిటీని పెంచింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడే పరిచయమే పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. గోపిసుందర్ ఈ పాటని లవ్లీ అండ్ మెస్మరైజింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలపించేలా వుంది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ పూడి ఎడిటర్.

ఈ చిత్రం జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం :

శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవిశ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జా శివ, కరణ్, గడ్డం శివ.

సాంకేతిక విభాగం :

రచన & దర్శకత్వం: భరత్ పెదగాని
నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి
ప్రొడక్షన్ బ్యానర్: ప్రొద్దుటూరు టాకీస్
విడుదల: శ్రీ విజయ ఫిల్మ్స్
సంగీతం: గోపీ సుందర్
DOP: రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి