మా యా పేటిక చిత్రం టైటిల్ లుక్ విడుదల

జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ‘మాయా పేటిక’.. టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్‌ను టాలీవుడ్ హండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థ‌లో మ‌రో వెరైటీ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్ర‌మ‌ణియ‌మ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ర‌మేష్ రాపార్తి
నిర్మాత‌లు : మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ : సురేష్ ర‌గుతు
మ్యూజిక్‌: గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌మ్‌
డైలాగ్స్‌: తిరుమ‌ల నాగ్‌
ఆర్ట్‌: పురుషోత్త‌మ్‌, బిక్ష‌ప‌తి, జె.కె.మూర్తి
ఎడిట‌ర్‌: డి.వెంట‌క ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌
పాట‌లు: శ్రీమ‌ణి
కొరియోగ్ర‌ఫీ : ప్రేమ్ ర‌క్షిత్‌, విజ‌య్ బిన్ని