మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సక్సెస్ మీట్

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీమ్ ను ఘనంగా సత్కారించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

హైదరాబాద్ :
తెలుగు తెరపై మంచి సినిమాలు, వినూత్న కాన్సప్ట్ తో వచ్చే సినిమాలను ప్రశంసించేందుకు నిత్యం ముందు వరుసలో ఉండే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మరోసారి తెలుగు సినిమాకు ఘనంగా సత్కారం చేసింది. బలగం సినిమాతో మొదలైన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీమ్ ను సోమవారం ఎఫ్ సి ఏ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా సన్మానించింది.

ఈ సినిమా నిర్మాత అప్పిరెడ్డి, హీరో బిగ్ బాస్ ఫెమ్ సోహెల్, దర్శకుడు శ్రీనివాస్ , మరో నిర్మాత రవీందర్ రెడ్డి , ఇతర నటీనటులు అభిషేక్ రెడ్డి, క్రాంతి, జ్యోస్నా, వర్షారెడ్డి, క్రాంతి, ప్రత్యూషలతో పాటు ఈ సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మరో సీనియర్ జర్నలిస్ట్ , ఎఫ్ సి ఏ మాజీ అధ్యక్షుడు ప్రభు హాజరై మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీమ్ ను అభినందించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ, ఈసీ మెంబర్స్ అప్పాజీ, ఆర్ డి ఎస్ ప్రకాష్, నవీన్ కుమార్, వీర్ని శ్రీనివాస్ పాల్గొని మిస్టర్ ప్రెగ్నెంట్ నటి నటులను, సాంకేతిక నిపుణులను సన్మానించారు. ఈ సినిమాను అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి కలిసి నిర్మించారు.

ఈ సందర్బంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ ఫిలిం క్రిటిక్స్ వారిచే ప్రశంసలు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిజానికి ఈ కాన్సప్ట్ ను తనవద్దకు తీసుకువచ్చింది రవీందర్ రెడ్డి అని అన్నారు. తనతో పాటు వెంకట్, రవీందర్ రెడ్డి అందరం ఎంతో ఇష్టంగా ఈ సినిమాను తెరకెక్కించమని అన్నారు. కమర్షియల్ గా ఎంత వచ్చింది అనే విషయాల కన్నా కూడా ఒక గొప్ప సినిమా తీశామన్న సంతృప్తి మిగిలిందని చెప్పారు. ఫిలిం క్రిటిక్స్ గాని, సినిమా చూసిన జనం కానీ సినిమా ఎంతగానో మెచ్చుకుంటుంటే మనసు పులకించిపోతోందని అన్నారు. సోహెల్ సహకారం మరువలేనిదని చెప్పారు. దర్శకుడు శ్రీనివాస్ నుంచి మొదలు కొని ప్రొడక్షన్ లక్ష్మణ్ వరకు ప్రతి ఒక్కరు ఇచ్చిన సహాయ సహకారాలు మరువలేనని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరో నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అప్పిరెడ్డి కేవలం కొత్త నటీనటులను మాత్రమే కాదు నాలాంటి కొత్త కొత్త నిర్మాతలను కూడా సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని పేర్కొన్నారు. చాలా కొత్త కాన్సెప్ట్ తో నిర్మించిన ఈసినిమాను ఎందరో బాగుంది అని చెవుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఇలా అభినందించడం తాము ఎప్పుడూ మరచిపోలేమన్నారు.

హీరో సోహెల్ మాట్లాడుతూ పదహారేళ్ళ నా కల నెరవేరిందని అన్నారు. సోహెల్ నటించిన గత రెండు సినిమాల కంటే ఈ సినిమాలో సోహెల్ చాలా బాగా నటించారని తనను ప్రశంసించిన వారందరికీ థాంక్స్ చెప్తున్నాని అన్నారు. అప్పిరెడ్డి సాహసం చెయ్యకపోతే ఈ సినిమాలేదని, ఈ సినిమాకోసం పడ్డ కష్టం , శ్రమ ఒక ఎత్తయితే ఇప్పుడు ఆయన కళ్ళలో ఆనందం కనిపిస్తోందని చెప్పారు. తొంభై శాతం ఆక్యుపెన్సీ తో నిండుగా జనం ఉన్న థియేటర్ లో సినిమా చూడటం అంటే ఒక నటుడికి ఇంతకంటే గొప్ప హ్యాపీ నెస్ ఇంకేం ఉంటుందని అన్నారు. ఈ సినిమాను మెచ్చుకున్న, ప్రశంసించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా తరువాత తాను ఎంత ఎత్తుకు ఎదిగినా అప్పిరెడ్డి ఒక ఫోన్ చేస్తే చాలు వచ్చి మీ ముందు వాలిపోతానని హామీ ఇచ్చారు. నిజానికి ఈ సినిమా పూర్తి కావడానికి తన మిత్రుడు అభిషేక్ ఇచ్చిన సహాయ సహకారం జీవితంలో మరువలేనని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేష కు కృతజ్ఞతలు తెలిపారు.

నటి క్రాంతి మాట్లాడుతూ మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే ఎక్కడైనా వల్గర్ గా చూపిస్తారేమో అని అనుకునేవాళ్లమని ,కానీ ఎంత గొప్పగా తీశారో మాటల్లో చెప్పలేమని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు అభినందించడం అంటే ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది ఆమె ఆందనం వ్యక్తం చేశారు.

అంతకు ముందు మాట్లాడిన జర్నలిస్టుల్లో
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ ఫిలిం క్రిటిక్స్ అంటే సినిమాలను పనిగట్టుకుని విమర్శించడం కాదని, ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రశంసించడం, వారిని అభినందించడం క్రిటిక్స్ భాద్యత కూడా అని అన్నారు. ఈ మధ్య కాలంలో బలగం అనే సినిమాను ఫిలిం క్రిటిక్స్ అభినందించింది, ఆ తరువాత ఎఫ్ సి ఏ మెచ్చుకున్నా సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని అన్నారు. ఈసినిమా నిర్మించడానికి ఒప్పుకున్న అప్పిరెడ్డి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని చెప్పారు. సోహెల్ చాలా చక్కగా నటించారని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరు తమవంతు పాత్రను అద్భుతంగా పోషించారని ప్రభు ప్రశంశించారు.

వ్యాఖ్యాత గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఒక కమలహాసన్ లాంటి నటుడు చేయాల్సిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని ప్రశంశించారు. నటుడు సోహెల్ నటన గురించి కమల హాసన్ తో పోల్చారు. ఎలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న ఎఫ్ సి ఏ ను అభినందింస్తున్నాని నాగేంద్ర కుమార్ అన్నారు. అడవిలో అమ్మ అని అరిస్తే ఆడుకోడానికి ఎవరూ రారని అలాంటి సినిమా పరిశ్రమలో ఒంటరి ప్రయాణాన్ని మొదలు పెట్టి వినూత్న కథలతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత అప్పిరెడ్డిని అభినందించడం అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. మహానుభావుడైన నందమూరి తారకరామారావు లాంటి హీరో అశ్విని దత్ లాంటి యంగ్ నిర్మాతలకు కూడా ఎంతో గౌరవం ఇచ్చేవాడని ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది అంటే నిర్మాతకు అంత గొప్ప గౌరవం ఉంటుంది అని అర్థమని నాగేంద్ర కుమార్ చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్, స్వాతి ముత్యం ఈ పేపర్ ఎడిటర్ అప్పాజీ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను తాను చూడలేదని అన్నారు. కానీ జర్నలిస్ట్ మిత్రులు, బయట జనం మాట్లాడుకుంటున్నదానిబట్టి ఈ సినిమా చాలా గొప్ప సినిమాగా తాను భావిస్తున్నానని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఆర్ డి ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ చిరంజీవికి ఉన్నమినాగు సినిమా ఎలాగో సోహెల్ కు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా అలాంటిది చెప్పారు. ఇలాంటి సినిమా చెయ్యడం ఆశ మాషీ వ్యవహారం కాదని అన్నారు. సోహెల్ చాలా బాగా నటించారని మెచ్చుకున్నారు. సినిమా చూస్తునంతసేపు సెకండ్ ఆఫ్ లో ఏదైనా తప్పు చేస్తారేమో అని అనుకున్నాను కానీ ఎక్కడ కూడా తప్పు లేకుండా ఈ కథను డీల్ చేసిన దర్శకుడు శ్రీనివాస్ ప్రతిభకు హ్యాట్సాఫ్ అని అన్నారు.

ఎఫ్ సి ఏ ఈ సి మెంబర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ సోహెల్ కు నటుడిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొనడం నిజానికి తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని కానీ సోహెల్ కోసం ఓటింగ్ చేశానని, తన పిల్లలు కూడా సోహెల్ కు ఓటింగ్ వేశారని చెప్పారు. నిర్మాత అప్పిరెడ్డి ఇలాంటి మంచి మంచి సినిమాలు మరిన్ని నిర్మించాలని నవీన్ కుమార్ కోరారు. నిర్మాత అప్పిరెడ్డి తో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రశంశిస్తున్నాని చెప్పారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీమ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఈ సినిమా పబ్లిసిటీకి తనవంతు సహాయం చేశానని, చాలా ప్రోగ్రామ్స్ చేశామని అన్నారు. ఈ సినిమాతో తాను అప్పిరెడ్డి కుటుంబసభ్యులో ఓ మెంబర్ గా అయ్యానని తెలిపారు. అప్పిరెడ్డి ఆఫీస్ కు వెళ్తే ఓ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుందని పేర్కొన్నారు. వార్త లో జర్నలిస్ట్ గా పని చేసే దగ్గరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మంచి సినిమాలను ప్రోత్సహిస్తూనే వచ్చానని అన్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరిని, సాంకేతిక నిపుణులను అభినందిస్తునాన్ని సురేష్ కొండేటి చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అంగీకరించిన ఎఫ్ సి ఏ సభ్యులందరికి సురేష్ కొండేటి థ్యాంక్స్ చెప్పారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ మాట్లాడుతూ బలగం సినిమా తరువాత ఎఫ్ సి ఏ ఇష్టపడి అభినందిస్తున్న సినిమా ఇదే అని అన్నారు. ఈ సినిమా బలగం సినిమా ఇప్పటికే వందకు పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది, అదేవిధంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను కూడా అవార్డుల కోసం పంపించాలని నిర్మాతలకు సలహా ఇచ్చారు. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సప్ట్ తో ఇంతవరకు బహుశా సినిమా రాలేదని, ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా జాతీయ , అంతర్జాతీయ వార్డులకు ఈ సినిమాను పంపించాలని కోరారు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ నిర్మాతల కంటే ఎన్ ఆర్ ఐ నిర్మాతలే ఎక్కువగా సినిమా చేస్తున్నారని అన్నారు. అయితే చాలా మంది ఎన్ ఆర్ ఐ నిర్మాతలు కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపుకే మొగ్గు చూపుతున్న తరుణంలో అప్పిరెడ్డి ఇలాంటి వెరైటీ కాన్సప్ట్ తో సినిమా తీయడం ఆయన అభిరుచికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇరవైఏళ్ళ క్రితం తాను ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పేపర్ లో పని చేస్తున్న రోజుల్లో ఈ సినిమా వచ్చి ఉంటె ప్రతి శుక్రవారం వచ్చే వెన్నెల పేజీ రివ్వు లో ఖచ్చితంగా 5కు 5 రేటింగ్ వచ్చి ఉండేదని అన్నారు.