ముఖ్యగమనిక చిత్రం సక్సెస్ మీట్

Published On: February 24, 2024   |   Posted By:

ముఖ్యగమనిక చిత్రం సక్సెస్ మీట్

ముఖ్య గమనిక చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు – దర్శకుడు వేణు మురళీధర్. వి
శివిన్ ప్రొడక్షన్ పతాకంపై రాజశేఖర్, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ముఖ్యగమనిక. వేణు మురళీధర్. వి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి,  లావణ్య సాహుకార జంటగా నటించారు. మిగతా పాత్రల్లో చిత్రం భాషా, ఆర్యన్ కృష్ణన్ తదితరులు నటించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను శనివారం నిర్వహించారు.
ఈ సంధర్భంగా దర్శకుడు వేణు మురళీధర్. వి. మాట్లాడుతూ… సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త కాన్సెప్ట్ తో తీసినందుకు కొత్త డైరక్టర్ అయినా బాగా ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరొసారి రుజువైంది. అందుకే సీడెడ్ లాంటి చోట్ల థియేటర్స్ ను పెంచుతున్నాం. ఇది నాడెబ్యు మూవీ. గతంలో ఈగ అసిస్టెంట్ కెమెరా మెన్, బాహుబలికి సెంథిల్ దగ్గర చీఫ్ అసోసియేట్ గా చేశా. గత 16 ఏళ్లుగా సినీ పరిశ్రమలో వివిధ సినిమాలకి సినిమాటోగ్రాఫర్ పని చేశా. ఈ చిత్ర హీరో విరాన్ ఎంతో సహకరించారు. తొలి చిత్రం అయినా బాగా నటించారు. నన్ను ఈ సినిమాకి దర్శకుడిని చేసిన మా నిర్మాతలు రాజశేఖర్, సాయి కృష్ణ లకు ధన్యవాదాలు.
నిర్మాతలు రాజశేఖర్, సాయి కృష్ణ మాట్లాడుతూ… మా శివిన్ ప్రొడక్షన్ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా ఇది. మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి అప్లాజ్ వస్తోంది. తొలి సినిమానే అయినా దర్శకుడు వేణు మురళీధర్ చాలా బాగా తీశారు. ఇక నుంచి మా బ్యానర్ లో ప్రతి సంవత్సరం ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా ఇంత బాగ రావడానికి సహకరించిన టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. హీరోకి ధన్యవాదాలు.
నటి ఆర్యన్ కృష్ణన్ మాట్లాడుతూ… ఈ సినిమా విజయం పట్ల చాలా సంతోషంగా వున్నాం. ఈ సినిమా కంటెన్ అందరికీ బాగా నచ్చుతుంది. టీమ్ అంతా ఎంతో డెడికేషన్ తో పనిచేసి ఈ సినిమా చేశాం. అందరూ చూసి సినిమాని సపోర్ట్ చెయ్యండి.
ఈ సక్సెస్ మీట్ లో సంగీత దర్శకుడు కిరణ్ వెన్న, ఎడిటర్ శివ తదితరులు పాల్గొన్నారు.
విరాన్ ముత్తం శెట్టి, లావ‌ణ్య, ఆర్య‌న్ కృష్ణ‌న్, భాషా త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి
ద‌ర్శ‌కత్వం: వేణు ముర‌ళీధ‌ర్.వి
బేన‌ర్: శివిన్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు: రాజ‌శేఖ‌ర్, సాయికృష్ణ‌
సంగీతం: కిర‌ణ్ వెన్న‌
సింగ‌ర్స్‌: న‌కాశ్ అజీజ్, రేవ‌తి శ్రిత‌
ఎడిట‌ర్‌: శివ శార్వాణి
పీఆర్ఓ: దుద్ధి శ్రీ‌ను