యాత్ర 2 మూవీ రివ్యూ

Published On: February 8, 2024   |   Posted By:

యాత్ర 2 మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

 

 

 

స్టోరీ లైన్ :

వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా) ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది.  తర్వాత ఏపీలో గెలవడం, వైఎస్సార్ సీఎం అవ్వడం చూపిస్తారు. ఐతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి, బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు. తర్వాత జగన్ మీద సిబిఐ కేసులు పెట్టి జైలు కి పంపించడం, జైలు నుంచి బయటకి వచ్చి 2014 ఎలక్షన్స్ లో ఓడిపోవడం, చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు ?, చివర్లో 2019 లో జగన్ సీఎం ఎలా అయ్యాడు ? అనేది మిగిలిన కథ..

ఎనాలసిస్ :

తన తండ్రి Y.S. రాజశేఖర్ రెడ్డి చనిపోయినా తర్వాత జగన్ ఎలా CM అయ్యాడు అనేది కథ..

ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ :

యాత్ర సినిమాలో మమ్ముట్టి ఎంతగా ఒదిగిపోయారో, ఈ సారి వైఎస్ జగన్ పాత్రలో జీవా కూడా అంతే ఒదిగిపోయాడు. హీరో జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చాలా బాగా నటించాడు. వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి,చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్ చక్కగా నటించారు.

టెక్నికల్ గా :

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి.  సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో BGM, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది. నిర్మాత శివ మేక పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు. మహి వి రాఘవ దర్శకత్వం కూడా బాగుంది.ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్ గా రన్ చేసారు. సినిమాని ఓ పక్క ఎమోషనల్ గా రన్ చేస్తూనే మరో పక్క జగన్ పాత్రకి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. అలాగే, స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.  కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది.

తీర్పు :

పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘యాత్ర 2’ జగన్ అభిమానులకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఓ ఎమోషనల్ ఫీస్ట్ గా నిలుస్తోంది.

నటీనటులు:

మమ్ముట్టి, జీవా, మహేష్ మంజ్రేకర్, కేతకీ నారాయణ్

సాంకేతికవర్గం :

సినిమా పేరు: యాత్ర 2
బ్యానర్లు: మూడు శరదృతువు ఆకులు, V సెల్యులాయిడ్
విడుదల తేదీ : 08-02-2024
సెన్సార్ రేటింగ్: “U/A”
తారాగణం : మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్
కథ – దర్శకుడు : మహి వి రాఘవ్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: మదీ
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
నిర్మాత: శివ మేక
నైజాం డిస్ట్రిబ్యూటర్ : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
రన్‌టైమ్: 120 నిమిషాలు