రాఘవ రెడ్డి చిత్రం మూవీ పాట విడుదల

Published On: January 1, 2024   |   Posted By:

రాఘవ రెడ్డి చిత్రం మూవీ పాట విడుదల

లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై శివ కంఠమనేని హీరోగా రూపొందుతోన్న రాఘవ రెడ్డి చిత్రం నుంచి ఐటెమ్ సాంగ్ చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్ రిలీజ్

చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం రాఘవ రెడ్డి సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం రాఘవ రెడ్డి. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

రాఘవరెడ్డి మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రాఘువ రెడ్డి నుంచి చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతాన్ని అందించారు. సాగర్ నారాయణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా..

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. శివ కంఠమనేనిగారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను జనవరి 5న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మంగ్లీగారు పాడిన చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్ సాంగ్ విడుదల చేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు.

నటీనటులు :

శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ తదితరులు.

సాంకేతిక వర్గం:

బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్
మ్యూజిక్ : సంజీవ్ మేగోటి సుధాకర్ మారియో
ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్
DOP : S. N. హరీష్
నిర్మాతలు : K. S. శంకర్ రావ్, R. వెంకటేశ్వర్ రావు, G. రాంబాబు యాదవ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి