రాజుగారి గది 3 పాత్రికేయుల సమావేశం
 
 
రాజుగారి గది 3 చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – ఓంకార్


రాజుగారి గది 3 విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ…

నా తమ్ముడు అశ్విన్ ను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ అందరికి ధన్యవాదాలు. ప్రేక్షుకుల సపోర్ట్ ఉంటే ఎవ్వరూ ఎక్కడికైనా వెళుతారు. వైజాగ్ మెలోడీ థియేటర్ లో పెద్ద హీరో షోస్ కు మాత్రమే ఫుల్ అవుతుంటాయి. కానీ మా రాజు గారి గది 3 ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా బాగా ఆధరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకోసం పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

ఆలీ మాట్లాడుతూ..

రాజు గారి గది 3 ను బాగా రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ కు థాంక్స్. ఈ సినిమాను అందరూ కష్టపడి పని చెయ్యడంతోనే ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రం నేను కూకట్ పల్లిలో చూడ్డం జరిగింది. ఆడియన్స్ సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుకు ఆదరిస్తున్నారు, వారి సపోర్ట్ చాలు ఈ చిత్రం విజయం సాధించడానికి అన్నారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ

సినిమాను వినోదం కోసం తీస్తారు. ఈ సినిమాలో అది ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 4 కోట్ల గ్రాస్ చేసింది ఈ సినిమా. అశ్విన్ ఈ సినిమా ప్రాణం పెట్టి తీసాడు. మంచి సినిమాను అందరూ ఆధరించాల్సిన అవసరం ఉందన్నారు.

అశ్విన్ మాట్లాడుతూ…

సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. నాకు ఈ సినిమాతో ఒక మార్కెట్ ఓపెన్ అయ్యిందని ఫ్రెండ్స్ చెబుతున్నారు, అందుకు సంతోషం. సినిమా చూసిన ప్రతివక్కరు బాగుందని చెబుతున్నారు. బుక్ మై షో రేటింగ్స్ ను చూసి నేను బాధ పడ్డాను. బుక్ మై షో వారు అందరి రేటింగ్స్ ను పరిగణలోకి తీసుకుని రేటింగ్స్ ఇస్తే బాగుండేది. వారు కేవలం నెగిటివ్ రేటింగ్స్ తీసుకొని పెడుతున్నారు. నేను, అవికా థియేటర్స్ విజిట్ చేశాము, రెస్పాన్స్ చేస్తుంటే అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సినిమా చూడమని ప్రేక్షకులను కోరారు.


హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ..

థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. నన్ను తెలుగులో ఇంతబాగా ఆధారిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ మాట్లాడుతూ..

అందరికి నమస్కారం. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఓంకార్ గారికి ధన్యవాదాలు. రాజు గారి గది 3 చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు థియేటర్స్ లో కూడా ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ…

నేను ఓంకార్ అన్నయ్యకు ఏకలవ్య శిషుడిని, ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం సంతోషం, థియేటర్ లో ఆలీ గారి కామెడీకి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. చోటా గారి తో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్స్ తెలిపారు.
 
 
 
 
 
5 Attachments